ETV Bharat / sports

IPL 2023 : సెంచరీతో అదరగొట్టిన బ్రూక్​.. కోల్​కతాపై హైదరాబాద్ విజయం - నితీశ్ రాణా కేకేఆర్​ vs ఎస్​ఆర్​హెచ్​ ఐపీఎల్ 2023

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 2023లో భాగంగా హైదరాబాద్​, కోల్​కతా మధ్య ఆసక్తికర మ్యాచ్​ జరిగింది. ఈ మ్యాచ్​లో హైదరాబాద్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ​

srh vs kkr result
srh vs kkr result
author img

By

Published : Apr 14, 2023, 10:59 PM IST

Updated : Apr 15, 2023, 7:11 AM IST

సన్​రైజర్స్, కోల్​కతా మ్యాచ్​ హోరాహోరిగా సాగింది. ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్​రైజర్స్ హైదరాబాద్​ 228 పరుగుల చేసింది. భారీ లక్ష్యంకో బరిలోకి దిగిన కోల్‌కతా.. 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల మాత్రమే చేయగలిగింది. నితీశ్​(75), రింకు సింగ్(58) రాణించినా ఫలితం లేకపోయింది.

సన్​రైజర్స్​ నిర్దేశించిన 229 పరుగులను ఛేదించడానికి కోల్​కతా విశ్వప్రయత్నాలు చేసింది. ఆ జట్టు ఓపెనర్​ రహ్మదుల్లా డకౌట్​ కాగా.. ఆదిలోనే ఒడుదొడుకులు ఎదుర్కొంది కోల్​కతా. మరో ఓపెనర్​ జగదీశన్​ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత వచ్చిన ఇద్దరు ప్లేయర్లలో వెంకటేశ్​(10) పరుగులు చేసి వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సునీల్​ నరైన్​ డకౌట్​ అయ్యాడు. దీంతో పీకల్లోతు కష్టాల్లో పడిన కోల్​కతాను నితీశ్​ రాణా(75) ఆదుకున్నాడు. ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడి హాఫ్​​ సెంచరీ పుర్తి చేశాడు. సంచలన బ్యాటర్ రింకూ సింగ్(58)తో​ అద్భుత ప్రదర్శన చేశాడు. మరోవైపు సన్​రైజర్స్​ బౌలర్లు కూడా తమదైన శైలిలో చెలరేగిపోయారు. జాసెన్, మయాంక్​ అగర్వాల్​ చెరో రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్​ ఒక వికెట్ తీశాడు.

అంతకుముందు టాస్​ ఓడి మొదట బ్యాటింగ్​ చేసిన హైదరాబాద్​ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి.. కోల్​కతాకు 229 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటర్​ హ్యారీ బ్రూక్ (100*)​ విధ్వంసకర ఇన్నింగ్స్​ ఆడి.. సెంచరీ పూర్తి చేశాడు. ఐదెన్ మార్​క్రమ్​ (50) హాఫ్​ సెంచరీతో చెలరేగి పోయాడు. అభిషేక్​ శర్మ (32) ఫర్వాలేదనిపించగా.. రాణిస్తారనుకున్న మయాంక్​ అగర్వాల్ ​​(9), రాహుల్​ త్రిపాఠి (9) సింగిల్​ డిజిట్​ స్కోరుకే పరిమితమయ్యారు. క్లాసెన్ (15*) పరుగులు చేశాడు. కోల్​కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్​ 3 వికెట్లు తీసి అదరగొట్టాడు. వరుణ్​ చక్రవర్తి ఒక వికెట్ తీశాడు.

ఐపీఎల్ 2023లో​ ఫస్ట్​ సెంచరీ.. హ్యారీ బ్రూక్​ ఘనత..
హైదరాబాద్​ జట్టు ఓపెనర్​ హ్యారీ బ్రూక్​.. వన్​ మ్యాన్​ షో చూపించాడు. మ్యాచ్​ ఆది నుంచి అంతం వరకు బౌండరీలతో మొత మోగించాడు. 12 ఫోర్లు, 3 సిక్సులతో.. 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్​లో మొదటి సెంచరీ సాధించిన ప్లేయర్​గా రికార్డు నమోదు చేశాడు.

Last Updated : Apr 15, 2023, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.