ETV Bharat / sports

సక్సెస్​ మంత్రం చెప్పిన గిల్​.. తెవాతియాపై ప్రశంసలు! - ఐపీఎల్​ లైవ్​ మ్యాచ్​

pbks vs gt 2022: పంజాబ్​తో శుక్రవారం జరిగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించి తన జైత్రయాత్రను కొనసాగించింది గుజరాత్​. చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాది జట్టుకు విజయం అందించిన తెవాతియాపై ప్రశంసలు కురిపించాడు గుజరాత్​ కెప్టెన్​ హార్దిక్​ పాండ్యా. మరోవైపు.. త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న ఓపెనర్​ శుభమన్​ గిల్​ తన సక్సెస్​ మంత్రాన్ని వెల్లడించాడు.

pbks vs gt 2022
శుభమన్​ గిల్​, రాహుల్​ తెవాతియా
author img

By

Published : Apr 9, 2022, 8:28 AM IST

pbks vs gt 2022: గుజరాత్​ అజేయ జైత్రయాత్ర కొనసాగించటంలో సమష్టిగా రాణిస్తున్నారు ఆ జట్టు సభ్యులు. పంజాబ్​తో శుక్రవారం జరిగిన ఉత్కంఠ పోరులో గిల్​ అద్భుత ఇన్నింగ్స్​కు తోడు చివర్లో తెవాతియా మెరుపులతో విజయం సాధించింది గుజరాత్​. దీంతో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన కెప్టెన్​ హార్దిక్​ పాండ్యా.. చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చిన రాహుల్​ తెవాతియాపై ప్రశంసలు కురించాడు. ఒత్తిడిలో క్రీజ్​లోకి వెళ్లి సిక్సర్లు కొట్టటం అంత సులభమేమీ కాదన్నాడు. కింగ్స్​ ఆటను తాము లాగేసుకున్నామని, అందుకు వారికి సానుభూతి తెలుపున్నట్లు చెప్పాడు.

"ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా నేను తటస్థంగా ఉంటాను. హాట్సాఫ్​ టూ తెవాతియా. అత్యంత ఒత్తిడిలో క్రీజ్​లోకి వెళ్లి సిక్సర్లు బాదటం చాలా గొప్ప విషయం. అది కింగ్స్​ గేమ్​. వారికి నా సానుభూతి. తాను ఉన్నానని గిల్ ఆటగాళ్లకు భరోసా ఇచ్చాడు. మంచి భాగస్వామ్యం ఏర్పరచిన సాయికే క్రెడిట్​ దక్కుతుంది. అది మమ్మల్ని పోటీలో నిలిపింది. మ్యాచ్​లు జరిగే కొద్ది నేను మెరుగుపడుతున్నాను."

- హార్దిక్​ పాండ్యా, గుజరాత్​ కెప్టెన్​.

గిల్​ సక్సెస్​ మంత్రం అదేనటా?: పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో అద్భుత ఇన్నింగ్​ ఆడిన శుభమన్​ గిల్​.. త్రుటిలో సెంచరీ మిస్​ చేసుకున్నాడు. 96 పరుగులు చేసి గుజరాత్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్​ అనంతరం మాట్లాడిన శుభమన్​ తన సక్సెస్​ మంత్రం.. గ్యాప్స్​ను గుర్తించటమేనన్నాడు. 'స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించటం చాలా ముఖ్యం. ఔట్​ఫీల్డ్​ వేగంగా ఉన్నందును గ్యాప్స్​లోకి బంతిని పంపటం ముఖ్యమని తెలుసుకున్నా. అదే అమలు చేశా. బాల్​ను బలంగా కొట్టటం, గ్యాప్స్​ను గుర్తించేందుకు బాగా ప్రయత్నాలు చేశా. నా శక్తి మేర బంతిని బౌండరీకి తరలిచేందుకు కృషి చేశా. ఒక ఓపెనర్​గా ఇన్నింగ్స్​ మొత్తం కొనసాగాలి. అది చివర్లో వచ్చే వారు పెద్ద షాట్లు కొట్టేందుకు వీలు కల్పిస్తుంది. వీలైనంత మేర డాట్​ బాల్స్​ తగ్గించేందుకే ప్రయత్నించా.' అని పేర్కొన్నాడు.

ఇప్పటివరకు ఐపీఎల్‌లో 60 మ్యాచ్‌లాడిన గిల్‌ 1501 పరుగులు సాధించాడు. ఇందులో 11 హాఫ్‌ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 84 నాటౌట్‌గా ఉంది. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో తన అత్యధిక స్కోరును మార్చుకున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 96 పరుగులు సాధించి ఐపీఎల్‌లో తన కెరీర్‌ బెస్ట్‌ స్కోర్‌ అందుకున్నాడు.

5-7 పరుగులు వెనకబడిపోయాం: శుక్రవారం ఉత్కంఠగా సాగిన పోరులో గుజరాత్​ చేతిలో ఓటమిపాలైంది పంజాబ్​. మ్యాచ్​ అనంతరం మాట్లాడిన ఆ జట్టు కెప్టెన్​ మయాంక్​ అగర్వాల్​ గట్టి పోటీ ఇచ్చినట్లు చెప్పాడు. తాము 5-7 పరుగులు వెనబడ్డామని, అయినా.. గుజరాత్​ బ్యాటింగ్​ ప్రారంభమైన కొద్ది సేపటికే మ్యాచ్​ను తమ చేతిలోకి తీసుకున్నట్లు తెలిపాడు.'వికెట్లు పడినప్పటికీ మంచి స్కోర్​ సాధించాం. దానికి చాలా సంతోషంగా ఉన్నాం. గట్టి పోటీ ఇచ్చాం. రబాడా, అర్షదీప్​ అద్భుతంగా బౌలింగ్​ చేశారు. ఆటను తమవైపు లాక్కునేందుకు చాలా కృషి చేశారు. మమ్మల్ని పోటీలో నిలిపారు. చివరి ఓవర్​ మ్యాచ్​ ఫలితాలను మార్చేయచ్చు' అని అన్నాడు.

ఇదీ చూడండి: IPL 2022: తెవాతియా మాయ.. ఉత్కంఠ పోరులో గుజరాత్​ విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.