ETV Bharat / sports

అరంగేట్రంలోనే కప్​ కొట్టిన గుజరాత్​... రాజస్థాన్​కు నిరాశ - ipl updates

ipl 2022 final match result
ipl 2022 final match result
author img

By

Published : May 29, 2022, 11:40 PM IST

Updated : May 30, 2022, 1:49 AM IST

23:32 May 29

అరంగేట్రంలోనే కప్​ కొట్టిన గుజరాత్​... రాజస్థాన్​కు నిరాశ

IPL 2022 Final Match: రెండు నెలల పాటు క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఐపీఎల్​ 15వ సీజన్​లో గుజరాత్​ టైటాన్స్​ జట్టు విజేతగా​ నిలిచింది. లీగ్​లో అడుగుపెట్టిన తొలి సీజన్​లోనే ఫైనల్​ చేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన గుజరాత్​.. అదే ఊపులో కప్పుకొట్టేసింది. ఆరంభ సీజన్​లో టైటిల్ గెలిచాక ఇంత కాలానికి మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టిన రాజస్థాన్​కు నిరాశ ఎదురైంది.

అహ్మదాబాద్‌ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన తుది సమరంలో ఏడు వికెట్ల తేడాతో గుజరాత్‌ ఘన విజయం సాధించి టైటిల్‌ని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించింది. గుజరాత్‌ బ్యాటర్లలో శుభమన్‌ గిల్‌ (45*; 43 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్ పాండ్య (34), డేవిడ్ మిల్లర్‌ (32*) రాణించగా.. సాహా (5), వేడ్ (8) విఫలమయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్‌ కృష్ణ, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులే చేసింది. బట్లర్ (39) రాణించకపోతే ఆ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. రాజస్థాన్‌ మిగిలిన బ్యాటర్లలో యశస్వీ జైస్వా్ల్‌ (22) ఫర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్‌ (14), దేవదత్‌ పడిక్కల్ (2), హెట్‌మెయర్‌ (11), అశ్విన్ (6), ట్రెంట్ బౌల్ట్‌ (11), రియాన్ పరాగ్ (15), మెకాయ్ (8) పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో హార్దిక్ పాండ్య మూడు వికెట్లతో మెరవగా.. సాయికిశోర్‌ రెండు, రషీద్‌ఖాన్‌, యశ్ దయాళ్‌, షమి తలో వికెట్‌ పడగొట్టారు. రాజస్థాన్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ (863) పరుగులతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవగా.. రాజస్థాన్‌ బౌలర్‌ యుజువేంద్ర చాహల్‌ (27) వికెట్లతో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా నిలిచాడు.

Last Updated : May 30, 2022, 1:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.