ETV Bharat / sports

IPL 2021 news: రాజస్థాన్​పై దిల్లీ విజయం.. అగ్రస్థానం కైవసం - దిల్లీ రాజస్థాన్ టాస్

రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్(rr vs dc 2021). 33 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. సంజూ శాంసన్ (70) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది.

IPL 2021 news
ఐపీఎల్
author img

By

Published : Sep 25, 2021, 7:17 PM IST

Updated : Sep 25, 2021, 7:54 PM IST

ఐపీఎల్ 2021లో విజయాల పరంపర కొనసాగిస్తోంది దిల్లీ క్యాపిటల్స్(rr vs dc 2021). ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తోన్న ఈ జట్టు నేడు (సెప్టెంబర్ 25) రాజస్థాన్ రాయల్స్(rr vs dc 2021)​పైనా గెలుపొందింది. 33 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్లింది. దీంతో ప్లే ఆఫ్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది.

దిల్లీ విధించిన 155 పరుగుల లక్ష్యాన్ని(vs dc 2021 scorecard) ఛేదించడంలో విఫలమైంది రాజస్థాన్. ఓపెనర్లు లివింగ్​స్టోన్ (1), జైస్వాల్ (5)తో పాటు స్టార్ బ్యాట్స్​మెన్ మిల్లర్ (7), మహిపాల్ లోమ్రోర్ (19), రియాన్ పరాగ్ (2) విఫలయ్యారు. అయినా కూడా కెప్టెన్ సంజూ శాంసన్(sanju samson ipl) పట్టుదలగా ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా జట్టును భారీ ఓటమి నుంచి తప్పించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అర్ధసెంచరీ సాధించాడు. చివరి వరకు క్రీజులో ఉన్న శాంసన్ 70 పరుగులతో నాటౌట్​ నిలిచినా.. జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.

దిల్లీ తడబడినా నిలబడింది

టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన దిల్లీ(delhi capitals team) శుభారంభం దక్కలేదు. ఈ సీజన్​లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఓపెనర్లు ధావన్ (8), పృథ్వీషా (10) ఈ మ్యాచ్​లో విఫలమయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ పంత్​తో కలిసి మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్​ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల పరుగులు చేయడంలో కాస్త ఇబ్బందిపడ్డారు. పంత్ తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. ఈ క్రమంలోనే పంత్​ (24)ను ముస్తాఫిజుర్ క్లీన్ బౌల్డ్ చేయగా, అయ్యర్​ (43) స్టంపౌట్​గా వెనుదిరిగాడు.

తర్వాత వచ్చిన హెట్​మెయర్​ కాసేపు రాజస్థాన్​ బౌలర్లను కాచుకుని దిల్లీ(delhi capitals team) ఇన్నింగ్స్​ను గాడినపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్​మెన్ రాజస్థాన్ బౌలర్లను ఎదుర్కోవడంలో విఫలమవడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులకు పరిమితమైంది దిల్లీ.

Last Updated : Sep 25, 2021, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.