IND vs ENG TEST MATCH : ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలిరోజు ఆటముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. ఆదిలోనే టాప్‌ఆర్డర్ కుప్పకూలడంతో పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్‌కు పంత్(146: 111 బంతుల్లో 20X4, 4X6)సెంచరీ, రవీంద్ర జడేజా ( 83 నాటౌట్: 163 బంతుల్లో 10X4) అర్ధ సెంచరీతో చెలరేగడంతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న కీలక పోరులో ఇంగ్లాండ్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యాక కొద్దిసేపు వరణుడు అడ్డంకిగా మారాడు. అప్పటికే శుభమన్ గిల్ (17), ఛెతేశ్వర్ పూజారా (13) రూపంలో భారత్ రెండు వికెట్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హనుమ విహారి(20), విరాట్ కోహ్లీ(11) స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యారు. తరువాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవకపోవడంతో భారత్ 98 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆదుకున్న పంత్, జడేజా..
100 పరుగుల లోపే 5 వికెట్లు పడడంతో భారత్ 200 పరుగులు అయినా చేస్తుందా అన్న సందేహం మొదలైంది. అయితే అప్పుడే పంత్ విశ్వరూపం మొదలైంది. జడేజా అండగా క్రీజులో కుదురుకున్న పంత్ వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. దీంతో పంత్ 89 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్‌తో తొలి టీ20కి అందుబాటులో రోహిత్.. కోహ్లీ, బుమ్రా మాత్రం..
అది ఆమెకు అలవాటే.. అందుకే నన్ను వదిలేసింది: పవిత్రా లోకేశ్ భర్త