చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ప్రశంసల వర్షం కురిపించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జడేజా అద్భుతంగా ఆడాడాని కొనియాడాడు. వికెట్‌ను సరిగ్గా ఉపయోగించుకుని సరైన లైన్ అండ్ లైంగ్త్‌తో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడని తెలిపాడు.
"సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆటతీరును గమనిస్తే అతడు తన లయను అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో జడ్డూ ఒక్క చెత్త బంతిని కూడా వేయలేదు. పర్పెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఫలితంగా పరుగులు పెద్దగా రాలేదు. ఇలాంటి సమయంలో భారీ షాట్లకు యత్నించినా ఫలితం పెద్దగా రాలేదు" అని హర్భజన్ అన్నాడు.
"మయాంక్ అగర్వాల్ భారీ షాట్ ఆడేందుకు చాలా తొందరగా క్రీజు నుంచి బయటకు వచ్చాడు. ఇలా చేస్తాడని ముందే ఊహించిన జడ్డూ కొంచెం వైడర్ లెంగ్త్ సంధించడంతో వికెట్ల వెనకున్న ధోనీ.. స్టంపౌట్ చేశాడు." అని హర్భజన్ తెలిపాడు. ఇమ్రాన్ తాహిర్ సూచనలతో జడేజా మెరుగ్గా బౌలింగ్ చేశాడని భజ్జీ చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై చెన్నై 7 వికెట్ల తేడాతో గెలిచింది. 135 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి గెలిచింది. డేవాన్ కాన్వే(77) అర్ధశతకంతో విజృంభించగా.. రుతురాజ్ గైక్వాడ్ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మయాంక్ మార్కండే 2 వికెట్లు మినహా మిగిలిన వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది. ముఖ్యంగా రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. 3 కీలక వికెట్లు పడగొట్టిన అతడు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
సుందర్ చెత్త రికార్డు..
ఇదే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఓ చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత ఎడిషన్‌లో వికెట్ పడగొట్టకుండా అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సుందర్.. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 13.4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టకుండా 118 పరుగులు సమర్పించుకున్నాడు. సుందర్ తర్వాత సీఎస్‌కే బౌలర్ దీపక్ చాహర్ (9 ఓవర్లలో 94), లఖ్‌నవూ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ (8 ఓవర్లలో 92), రాజస్థాన్ రాయల్స్ పేసర్ కేఎం ఆసిఫ్ (7 ఓవర్లలో 69), గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ (6 ఓవర్లలో 95)లు వికెట్ లేకుండా (కనీసం 6 ఓవర్లు వేసి) చెత్త రికార్డులతో లీగ్‌లో కొనసాగుతున్నారు.