ETV Bharat / sports

'టీమ్​ఇండియాకు అతడు భవిష్యత్​ ఆల్​రౌండర్' - rashid khan abhishek

తమ జట్టు ఆటగాడు అభిషేక్​ శర్మను ప్రశంసించాడు సన్​రైజర్స్​ హైదరాబాద్​ స్పిన్నర్​ రషీద్​ ఖాన్​. అతడు భవిష్యత్​లో టీమ్​ఇండియాకు సమర్థవంతమైన ఆల్​రౌండర్​గా ఎదుగుతాడని అన్నాడు.

Abhishek Sharma, Rashid Khan
రషీద్​ ఖాన్, అభిషేక్​ శర్మ
author img

By

Published : Apr 22, 2021, 12:46 PM IST

బుధవారం పంజాబ్​ కింగ్స్​తో జరిగిన ఐపీఎల్​ మ్యాచులో సన్​రైజర్స్​ హైదరాబాద్​ 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంలో రెండు వికెట్లు తీసి తనవంతు పాత్ర పోషించాడు అభిషేక్​ శర్మ. దీనిపై స్పందించిన సన్​రైజర్స్​ మరో ఆటగాడు స్పిన్నర్​ రషీద్​ ఖాన్​.. అభిషేక్​పై ప్రశంసలు కురిపించాడు. టీమ్​ఇండియాకు భవిష్యత్​ ఆల్​రౌండర్​గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"భవిష్యత్​లో టీమ్​ఇండియాకు ​నికార్సయిన ఆల్​రౌండర్​గా ఎదుగుతావు. నీకు చాలా సామర్థ్యం ఉంది. నీవు కష్టపడితే విజయాలను అందుకుంటావు" అని రషీద్​ ప్రశంసించాడు.

తన ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. "బౌలింగ్​ చాలా ప్రాక్టీస్​ చేస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలను. లాక్​డౌన్​లో ఇంటి వద్ద నా చిన్ననాటి కోచ్​ మా నాన్న లెఫ్ట్​ ఆర్మ్​ స్పిన్నర్​ వద్ద బౌలింగ్​లో వైవిధ్యాలను​ నేర్చుకున్నాను. మ్యాచు ఆడేటప్పుడు వాటిని అమలు చేసే విశ్వాసం నాలో ఉంది." అని రషీద్​ చెప్పాడు.

సన్​రైజర్స్​.. తన తర్వాతి మ్యాచ్​ను దిల్లీ క్యాపిటల్స్​తో చెన్నై చిదంబరం స్డేడియం వేదికగా ఏప్రిల్​ 25(ఆదివారం)న ఆడనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.