ఐపీఎల్ 2022 సీజన్ దృష్ట్యా క్రికెటర్ల మెగా వేలం(IPL 2022 Auction) నిబంధనలు వెల్లడించింది ఐపీఎల్ పాలక మండలి. ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లనే రిటైన్(IPL 2022 retention policy) చేసుకునే అవకాశం కల్పించింది. రిటైన్ ఆటగాళ్లు మినహా మిగతా క్రికెటర్లందరూ వేలంలోకి రానున్న నేపథ్యంలో ఐపీఎల్లో చేరిన రెండు కొత్త జట్లు.. ముగ్గురు ప్లేయర్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది.
క్రికెటర్ల మెగా వేలం డిసెంబర్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి నిబంధనలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రస్తుత ఫ్రాంఛైజీలు ఇద్దరు స్వదేశీ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను లేదా ముగ్గురు స్వదేశీ, ఓ విదేశీ ఆటగాడిని రిటైన్ చేసుకునే అవకాశం ఉందని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తెలిపింది. ఈ వేలంలో ఆర్టీఎమ్(రైట్ టు మ్యాచ్) కార్డుల అవకాశం ఉండని స్పష్టం చేసింది. ఈ మెగా ఆక్షన్‌లో ఆటగాళ్ల కోసం రూ. 90 కోట్లు వరకు ఖర్చు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
రెండు కొత్త జట్లు..
వచ్చే ఏడాది ఐపీఎల్(ipl 2022) సీజన్ కోసం మరో రెండు కొత్త ఫ్రాంచైజీలను(ipl new team) ప్రకటించింది బీసీసీఐ. అహ్మదాబాద్, లఖ్‌నవూ జట్లు వచ్చే సీజన్లో పోటీపడబోతున్నాయని అధికారికంగా వెల్లడించింది. దీంతో ఐపీఎల్-2022లో మొత్తం 10 జట్లు టైటిల్ పోరులో నిలబడనున్నాయి. అహ్మదాబాద్‌ను సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ దక్కించుకోగా, లఖ్‌నవూ.. ఆర్పీఎస్జీ గ్రూప్‌నకు దక్కింది. సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ ₹5,625 కోట్లకు, ఆర్పీఎస్జీ గ్రూప్ 7,090 కోట్లతో ఈ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి.
ఇదీ చదవండి: