ETV Bharat / sports

ఐపీఎల్​కు ముందు గుజరాత్​కు షాక్​.. సీజన్ ఆరంభ మ్యాచ్​లను కీలక ప్లేయర్ దూరం.. - david miller

ఐపీఎల్‌-2023 ప్రారంభానికి డిఫెండింగ్‌ ఛాంపియన్ గుజరాత్‌ టైటాన్స్‌కు ఓ భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు​ డేవిడ్‌ మిల్లర్‌ ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. అదేంటంటే?

david miller
david miller
author img

By

Published : Mar 21, 2023, 8:23 AM IST

ఐపీఎల్‌-2023 ప్రారంభానికి ముందే జట్లకు షాక్ ఇస్తున్నారు కొంత మంది ప్లేయర్స్. ఈ క్రమంలో మార్చి 31న తమ తొలి మ్యాచ్​కు సిద్ధం కానున్న డిఫెండింగ్‌ ఛాంపియన్ గుజరాత్‌ టైటాన్స్‌కు ఓ భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టులోని సౌతాఫ్రికా ప్లేయర్​ డేవిడ్‌ మిల్లర్‌ ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లకు అతను దూరంగా ఉండనున్నట్లు స్వయంగా ప్రకటించాడు. వరల్డ్‌ కప్ సూపర్ లీగ్​లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగే రెండు వన్డే మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో మిల్లర్‌తో పాటు పలువురు సఫారీ స్టార్‌ ప్లేయర్లు కూడా ఐపీఎల్​లో కొన్ని మ్యాచ్​లకు దూరం కానున్నారు.

సరిగ్గా ఐపీఎల్‌-2023 ప్రారంభ తేదీనే సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్‌తో తొలి వన్డే ఆడనుంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 2న రెండో వన్డే ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది చివరన జరిగే వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సంపాదించాలంటే సఫారీ సేన ఈ రెండు వన్డేల్లో ఎలాగైన గెలిచి తీరాలి. ఇందుకోసమే క్రికెట్‌ సౌతాఫ్రికా తమ స్టార్‌ ప్లేయర్స్​ అందరినీ ఈ మ్యాచ్‌లకు కచ్చితంగా అందుబాటులో ఉండాలని కోరింది.

అయితే ఇది కచ్చితంగా చేయాల్సినది కానప్పటికీ జట్టు అవసరాల దృష్ట్యా సౌతాఫ్రికా క్రికెటర్లందరూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిల్లర్‌తో పాటు మార్కో జన్సెన్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), ఎయిడెన్‌ మార్క్రమ్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (ముంబై ఇండియన్స్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), అన్రిచ్‌ నోర్జే, లుంగి ఎంగిడి (ఢిల్లీ క్యాపిటల్స్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌, క్వింటన్‌ డికాక్‌ (లఖనవూ), రబాడ (పంజాబ్‌) వీరంతా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నాయి.

కాగా, గతేడాది ఐపీఎల్‌కు ముందు కూడా సౌతాఫ్రికా క్రికెటర్లు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే అప్పుడు జన్సెన్‌, రబాడ, ఎంగిడి, మార్క్రమ్‌, డస్సెన్‌ తమ జాతీయ జట్టుకు కాకుండా ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇచ్చి లీగ్‌లో ఆడారు. ఆ సమయంలో బంగ్లాదేశ్‌తో సౌతాఫ్రికా టెస్ట్​ సిరీస్​ ఆడింది.

చెన్నై, బెంగళూరుకు దూరమైన ప్లేయర్స్..
ఇటీవలే చెన్నై సూపర్​ కింగ్స్​ ప్లేయర్​ కైల్ జేమీస‌న్ గాయం కారణంగా రానున్న ఐపీఎల్​ మ్యాచ్​లకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతని స్థానంలో సౌతాఫ్రికా పేస‌ర్ సిసాండను జ‌ట్టులోకి తీసుకుంటున్న‌ట్లు చెన్నై ఫ్రాంచైజీ ప్ర‌క‌టించింది. అంతకు ముందు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు టీమ్​కు చెందిన ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్ విల్ జాక్స్ కూడా గాయం కారణంగా కొన్ని మ్యాచ్​లకు దూరమయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.