ETV Bharat / sports

అహ్మదాబాద్​ జట్టు ఇక 'గుజరాత్ టైటాన్స్'.. కెప్టెన్ హార్దిక్ పాండ్య - ipl 2022

IPL Gujarat titans: హార్దిక్ పాండ్య కెప్టెన్​గా వ్యవహరించే కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ అని పేరు పెట్టారు. 'శుభ్ ఆరంభ్' అని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు.

hardik pandya
హార్దిక్ పాండ్య
author img

By

Published : Feb 9, 2022, 2:09 PM IST

Hardik pandya IPL: ఐపీఎల్​లో ఈ సీజన్​తో ఎంట్రీ ఇవ్వనున్న అహ్మదాబాద్​ జట్టుకు 'గుజరాత్​ టైటాన్స్​' అని పేరు పెట్టారు. ఈ టీమ్​కు ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వహించనున్నాడు.

ఈ ఏడాది లీగ్​లో అడుగుపెట్టిన కొత్త జట్లలో సీవీసీ గ్రూప్​.. అహ్మదాబాద్​ జట్టును రూ.5625 కోట్లకు కొనుగోలు చేసింది. సంజీవ్ గోయంకా ఆర్​పీఎస్​జీ.. లక్నో ఫ్రాంచైజీని రూ.7090 కోట్లకు సొంతం చేసుకుంది. వీటిలో లక్నో టీమ్​కు 'లక్నో సూపర్​జెయింట్స్' అని పేరు పెట్టగా, అహ్మదాబాద్​ జట్టుకు 'గుజరాత్ టైటాన్స్' అని పేరు పెట్టారు.

గుజరాత్ టైటాన్స్.. ప్రీ ఆక్షన్​లో హార్దిక్ పాండ్య-రూ.15 కోట్లు, రషీద్ ఖాన్- రూ.15 కోట్లు, శుభ్​మన్ గిల్- రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే మెగావేలంలో మిగిలిన ప్లేయర్లను ఎంపిక చేసుకోనుంది.

భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా.. గుజరాత్ టైటాన్స్​ జట్టుకు హెడ్​కోచ్​గా వ్యవహరించనున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్​ గెలవడంలో కీలకపాత్ర పోషించిన మాజీ కోచ్ గ్యారీ కిర్​స్టన్.. మెంటార్, బ్యాటింగ్ కోచ్​గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

ipl 2022
ఐపీఎల్ 2022

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.