ETV Bharat / sports

'జోఫ్రా అలా రెచ్చిపోతాడని అస్సలు ఊహించలేదు' - smith jos buttler

చెన్నై జట్టుపై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్​, జోఫ్రా ఆర్చన్​పై ప్రశంసల వర్షం కురిపించాడు రాజస్థాన్​ రాయల్స్​ సారథి స్టీవ్​ స్మిత్​. క్వారంటైన్​ కారణంగా ఈ మ్యాచ్​కు దూరమైన జాస్​ బట్లర్... తర్వాతి మ్యాచ్​లో జట్టులోకి తిరిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

buttler
బట్లర్​
author img

By

Published : Sep 23, 2020, 7:36 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

చెన్నై జట్టుపై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్, జోఫ్రా ఆర్చర్​​ను ప్రశంసించాడు రాజస్థాన్​ రాయల్స్​ జట్టు సారథి స్టీవ్​ స్మిత్​. అద్భుతంగా బ్యాటింగ్​ చేశారని కొనియాడాడు. జోఫ్రా మైదానంలో ఆ విధంగా రెచ్చిపోతారని అస్సలు ఊహించలేదన్నాడు.

ఈ జట్టులోని మరో కీలక ఆటగాడు జాస్ బట్లర్​.. క్వారంటైన్​లో ఉండటం వల్ల ఈ మ్యాచ్​కు అందుబాటులో లేదు. దీంతో ఓపెనర్​గా స్మిత్​ దిగాల్సి వచ్చింది. కాగా, ఈ విషయమై స్మిత్​ ​మాట్లాడుతూ.. "బట్లర్​ టాప్​ ఆర్డర్​లో బ్యాటింగ్​ చేయడానికి బాగా ఇష్టపడతాడు. ఆ స్థానంలో బ్యాటింగ్​కు దిగి మంచి విజయాలను అందుకున్నాడు. అతడు వచ్చాక ఏ స్థానంలో ఎవరు దిగాలి అనేది జట్టు అవసరానికి అనుగుణంగా ఆలోచిస్తాం. అతడు జట్టులోకి తిరిగి రావడం వల్ల సమస్యేమి లేదు. కానీ తుది జట్టు ఎంపికకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయి" అని అన్నాడు.

చెన్నైతో జరిగిన మ్యాచ్​లో సంజూ శాంసన్​(32 బంతుల్లో 74 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌కు.. స్టీవ్ స్మిత్(47 బంతుల్లో 69 పరుగులు) తోడవడం వల్ల రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. ఈ సీజన్​లో 200 పైగా స్కోరు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. అయితే శాంసన్ తరువాత వరుసగా వికెట్లు కోల్పోయినా.. చివరి ఓవర్లో ఆర్చర్ సునామీ ఇన్నింగ్స్‌ వల్ల 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 216 పరుగులు చేసింది రాజస్థాన్​.

ఇదీ చూడండి సచిన్​ ప్రశంసలకు పొంగిపోయిన శాంసన్​!

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.