ETV Bharat / sports

Taliban Cricket Club: భారత్​లోని టీ20 లీగ్​లో 'తాలిబన్'​ జట్టు - తాలిబన్​ క్రికెట్ క్లబ్ జైసల్మీర్

'తాలిబన్​ క్రికెట్​ క్లబ్'​ (Taliban Cricket Club).. ఇదేదో అఫ్గానిస్థాన్​కు చెందిన క్రికెట్​ జట్టు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు మైదానంలో కాలేసినట్లే. రాజస్థాన్​లో నిర్వహించిన ఓ టోర్నీలో ఈ పేరుతో బరిలోకి దిగింది ఓ టీమ్. ఓ మ్యాచ్​ కూడా ఆడింది. అందులో గెలిచింది. ఆ తర్వాత ఏమైదంటే?

Taliban Cricket Club
తాలిబన్​ క్రికెట్ క్లబ్
author img

By

Published : Aug 25, 2021, 9:02 AM IST

తాలిబన్​.. ఈ పేరు చెప్పగానే ప్రస్తుతం అఫ్గాన్​లో వారి అకృత్యాలు, అరాచకాలు.. గుర్తొస్తాయి. రాజస్థాన్​లో నిర్వహించిన ఓ క్రికెట్​ టోర్నీలో మాత్రం 'తాలిబన్ క్రికెట్ క్లబ్​'​ (Taliban Cricket Club) పేరుతో ఓ క్రికెట్​ జట్టు పాల్గొనడం చర్చనీయాంశమైంది.

రాజస్థాన్​లోని ఓ టీ20 లీగ్​లో​ పాల్గొన్న ఓ జట్టు​.. తమ టీమ్​ పేరును 'తాలిబన్​ క్రికెట్​ క్లబ్​' అని పెట్టుకుంది. ఈ విషయాన్ని గ్రహించిన నిర్వాహకులు టోర్నీ నుంచి ఆ జట్టును తప్పించారు. తొలి మ్యాచ్​ అనంతరం వారిపై నిషేధం విధించారు. ఈ తప్పిదంపై నిర్వాహకులు క్షమాపణలు కూడా చెప్పారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

జైసల్మేర్​ జిల్లా భనియనా గ్రామానికి చెందిన ఓ గ్రూప్​ తాలిబన్​ పేరుతో టోర్నీలో పాల్గొంది. ఈ ప్రాంతం పోఖ్రాన్​ నుంచి 36 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ మైనార్టీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. పోఖ్రాన్​ ఫైర్​ రేంజింగ్​ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఇది సున్నితమైన ప్రదేశంగా పరిగణిస్తుంటారు.

ఇదీ చదవండి: IND vs ENG: మూడో టెస్టు కోసం పటిష్ట వ్యూహాలతో ఇరుజట్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.