ETV Bharat / sports

womens cricket: సెమీస్​కు దూసుకెళ్లిన టీమ్​ఇండియా.. బార్బడోస్​పై భారీ విజయం - india womens team reach the semis

womens cricket: బర్మింగ్​హమ్​లో జరుగుతున్న కామన్​వెల్త్​ గేమ్స్​లో మహిళల క్రికెట్ టీమ్ సెమీస్​కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్​లో అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్‌లో రోడ్రిగ్స్‌ (56* నాటౌట్‌; 46 బంతుల్లో 6x4, 1x6), బౌలింగ్‌లో రేణుకా సింగ్ 4/10 విజృంభించిన వేళ భారత్‌ 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

womens cricket
womens cricket
author img

By

Published : Aug 4, 2022, 3:25 AM IST

womens cricket: కామన్వెల్త్‌ మహిళా క్రికెట్‌ కీలక మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బార్బడోస్‌ను చిత్తుగా ఓడించి గ్రూప్‌-A నుంచి సెమీస్‌కు దూసుకెళ్లింది. బ్యాటింగ్‌లో రోడ్రిగ్స్‌ (56* నాటౌట్‌; 46 బంతుల్లో 6x4, 1x6), బౌలింగ్‌లో రేణుకా సింగ్ 4/10 విజృంభించిన వేళ భారత్‌ 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. బార్బడోస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 62 పరుగులు మాత్రమే చేసింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టుకు ఆరంభంలో షాక్‌ తగిలింది. షకెరా సెల్మాన్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్‌ స్మృతీ మంధాన (5) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేరింది. ఆపై షఫాలీ వర్మ (43), రోడ్రిగ్స్ (56*) దూకుడుగా ఆడుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలిసి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 9 ఓవర్లో షఫాలీ రనౌట్‌ కాగా, ఆ వెంటనే వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ డకౌట్‌ అయింది. ఆ తర్వాత తానియా (6) కూడా నిరాశపరచగా, రోడ్రిగ్స్‌తో కలిసి దీప్తి శర్మ (31* నాటౌట్‌) స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. దీంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

163 పరుగుల లక్ష్యఛేదనలో బార్బడోస్‌ బ్యాటర్లు చతికిలపడ్డారు. ఆది నుంచి భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీశారు. టీమిండియా బౌలర్లలో రేణుకా సింగ్‌ 4 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేయగా, మేఘ్నా సింగ్‌, స్నేహ రాణా, రాధా యాదవ్, హర్మన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. బార్బడోస్‌ బ్యాటర్లలో కైషోనా నైట్ (16) టాస్‌ స్కోరర్‌గా నిలిచింది.

ఇవీ చదవండి: వెయిట్​లిఫ్టింగ్​లో​ కాంస్యం.. హాకీ, బాక్సింగ్​లో భారత్​ జోరు

'ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌..' ప్రెజెంటేషన్‌ ఇవ్వాలని ఐసీసీకి ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.