ETV Bharat / sports

Ind VS Ireland : రింకు, సంజు దూకుడు.. బంతితో ప్రసిద్ధ్ మెరుపులు.. రెండో టీ20 హైలైట్స్ - ఐర్లాండ్ టీమ్​ఇండియా రింకూ సింగ్

India VS Ireland Second T20 2023 Highlights : ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్​ఇండియా 33 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆ మ్యాచ్​ హైలైట్స్​..

India VS Ireland Second T20 2023 Highlights rat
India VS Ireland Second T20 2023 రింకూ మెరుపులు.. సంజు దూకుడు.. ప్రసిద్ధ్​ కృష్ణ .. రెండో టీ20 హైలైట్స్​
author img

By

Published : Aug 21, 2023, 7:30 AM IST

India VS Ireland Second T20 2023 Highlights : ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్​ఇండియా 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20 సిరీస్​ను ఓ మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో తొలి సారి బ్యాటింగ్‌ చేసిన రింకూ సింగ్(Rinku singh vs Ireland) 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 38 పరుగులు చేసి చివర్లో మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్​ భారీ స్కోరు చేయగలిగింది. మెకర్థీ వేసిన 19 ఓవర్లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదిన అతడు... అడైర్ వేసిన చివరి ఓవర్లో నాలుగో బంతికి సిక్స్ కొట్టి ఆకట్టుకున్నాడు.

Sanju Samson VS Ireland : కొంత కాలంగా పేలవమైన సంజు శాంసన్‌ పేలవమైన ఫామ్​ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతడు ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో దూకుడు ప్రదర్శించాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 40 పరుగులు చేశాడు. జోష్ లిటిల్ వేసిన 11 ఓవర్​లో మొదటి మూడు బంతులను బౌండరీకి పంపించి హ్యాట్రిక్‌ ఫోర్లు కొ సాధించాడు. ఐదో బంతిని అద్భుతంగా సిక్సర్‌గా మలిచాడు.

Prassidh Krishna VS Ireland : ఛేదనలో ఐర్లాండ్​ జట్టులో బాల్‌బిర్నీ (72; 51 బంతుల్లో 5×4, 4×6) ఒక్కడే రాణించాడు. ఇంకెవరూ అంతగా రాణించలేదు. మొదటి రెండు ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 18 పరుగులు చేసిందా జట్టు. కానీ ఆ తర్వాత బంతి అందుకున్న ప్రసిద్ధ్‌.. ఆ జట్టుకు గట్టి షాకిచ్చాడు. మూడో ఓవర్‌లో స్టిర్లింగ్‌ (0), టకర్‌ (0)ను డకౌట్‌ చేసి కథ మొత్తం మార్చేశాడు. షార్ట్‌ పిచ్‌ బంతులతో వారిద్దరిని బోల్తా కొట్టించాడు. స్టిర్లింగ్.. అర్ష్‌దీప్‌ సింగ్‌కు, టకర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు.

India VS Ireland Second T20 2023 : ఈ మ్యాచ్​లో మొదట టీమ్​ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (43 బంతుల్లో 58; 6×4, 1×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. సంజు శాంసన్‌ ( 26 బంతుల్లో 40; 5×4, 1×6) పర్వాలేదనిపించగా.. రింకూ సింగ్‌ (21 బంతుల్లో 38; 2×4, 3×6) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్​గా నిలిచాడు. ఐర్లాండ్‌ బౌలర్లలో మెకార్తి (2/36) నమోదు చేశాడు. ఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఆండీ బాల్‌బిర్నీ ఒక్కడే (51 బంతుల్లో 72; 5×4, 4×6) గట్టిగా రాణించాడు. బుమ్రా (2/15), ప్రసిద్ధ్‌ కృష్ణ (2/29), రవి బిష్ణోయ్‌ (2/37) దెబ్బకు మిగతా వారు విఫలమైపోయారు. చివరి టీ20 బుధవారం(ఆగస్ట్​ 23) జరుగుతుంది.

Ind vs Ire 2nd T20 : ఐర్లాండ్​పై టీమ్ఇండియా ఘన విజయం.. మరో మ్యాచ్​ ఉండగానే సిరీస్ కైవసం

నాకు ఆ హక్కు ఉంది.. నేను ఎవరితో తప్పుగా ప్రవర్తించలేదు : హర్మన్​ప్రీత్ కౌర్

For All Latest Updates

TAGGED:

IRE VS IND
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.