ETV Bharat / sports

Asia Games 2023 : భారత్​ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్ అతడే! - ఆసియా క్రీడలు 2023 పురుషుల క్రికెట్​ జట్టు

Asia Games 2023 : ఆసియా క్రీడల్లో భాగంగా జరగనున్న క్రికెట్​ టోర్నీ కోసం బీసీసీఐ తాజాగా పురుషుల, మహిళల టీమ్స్​ను ప్రకటించింది. ఐపీఎల్‌లో రాణించిన చాలా మందికి ప్లేయర్లకు ఈ జట్టులో అవకాశం ఇచ్చారు. ఐపీఎల్​లో అద్భుత ప్రదర్శిన కనబర్చిన యంగ్​ ప్లేయర్​కు పురుషుల జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అతడెవరంటే..?

asia games 2023 teams
asia games 2023
author img

By

Published : Jul 15, 2023, 4:52 PM IST

India Asia Games 2023 : చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023లో పాల్గొనేందుకు పురుషుల, మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ చీఫ్​ సెలెక్టర్​ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. ఈ ప్లేయర్లను ఎంచుకుంది. పురుషుల జట్టు సారథిగా యంగ్​ ప్లేయర్​ రుతురాజ్​ గైక్వాడ్​కు బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్​ 16వ సీజన్​లో తనదైన స్టైల్​లో రాణించిన రుతురాజ్​.. ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది.

ఆసియా క్రీడల్లో సీనియర్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ కెప్టెన్​ బాద్యతలు వహిస్తాడని ప్రచారం జరిగినప్పటికీ.. సెలక్టర్లు యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో రుతురాజ్‌ వైపు మొగ్గు చూపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో రాణించి టీమ్​ఇండియా జట్టులో చోటు కోసం ఎదరు చూస్తున్న చాలా మందికి ప్లేయర్లకు సెలెక్టర్లు ఈ జట్టులో అవకాశం ఇచ్చారు. రాజస్థాన్​ ప్లేయర్​ యశస్వి జైస్వాల్‌, ముంబయి టీమ్​ తిలక్ వర్మ, పంజాబ్​ కింగ్స్​ జితేశ్ శర్మ, కోల్​కతా టీమ్​ రింకూ సింగ్ లాంటి కీలక ప్లేయర్లకు ఇందులో చోటు దక్కింది.

  • NEWS 🚨- Team India (Senior Men) squad for 19th Asian Games: Ruturaj Gaikwad (Captain), Yashasvi Jaiswal, Rahul Tripathi, Tilak Varma, Rinku Singh, Jitesh Sharma (wk), Washington Sundar, Shahbaz Ahmed, Ravi Bishnoi, Avesh Khan, Arshdeep Singh, Mukesh Kumar, Shivam Mavi, Shivam…

    — BCCI (@BCCI) July 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టీమ్​ఇండియా తుది జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖే కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).

స్టాండ్‌బై : యష్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.

మహిళల తుది జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి సర్వాని, తితాస్ సవాణి రాజేశ్వరి గయాక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), అనూషా బరెడ్డి.

స్టాండ్‌బై : హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్.

Asia Games 2023 : టీ20 ఫార్మాట్‌లో జరుగనున్న ఈ మ్యాచ్​లు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్నాయి. ఈ సమయంలోనే భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 కూడా జరగనుంది. దీంతో ఆసియా గేమ్స్‌కు పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టును పంపాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. అందుకోసమే ఐపీఎల్‌తోపాటు దేశవాళీ క్రికెట్​లో రాణించిన కుర్రాళ్లను సెలెక్ట్ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.