IND VS WI: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలోనూ టీమ్ఇండియానే గెలుపొందింది. 44పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
భారత్ నిర్దేశించిన 238 పరుగుల లక్ష్యంతో.. ఛేదనకు దిగిన విండీస్ 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో వన్డే సిరీస్ భారత్ సొంతమైంది. భారత విజయంలో ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు కీలకంగా వ్యవహరించాడు. విండీస్ బ్యాటర్లలో షమా బ్రూక్స్ (44) టాప్ స్కోరర్. అకీల్ హోసెయిన్ (34) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లు షాయ్ హోప్ (27), బ్రెండన్ కింగ్ (18) పరుగులు చేసి వెనుదిరిగారు. డారెన్ బ్రావో (1), నికోలస్ పూరన్ (9), జేసన్ హోల్డర్ (2), ఫేబియన్ అలెన్ (13), కీమర్ రోచ్ (0) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన ఓడీన్ స్మిత్ (24) ధాటిగా ఆడాడు. అల్జారీ జోసెఫ్ (7) నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 4, శార్దూల్ ఠాకూర్ 2, యుజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంతో కొనసాగుతోంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోచ్ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ(5) పెవిలియన్ చేరాడు. అతడు వికెట్ల వెనుక కీపర్‌కు చిక్కడం వల్ల భారత్ 9 పరుగుల వద్ద తొలి వెకెట్ నష్టపోయింది. ఇక ఓపెనర్‌గా వచ్చిన రిషభ్ పంత్(18).. ఓడియన్ స్మిత్ వేసిన 11.1 ఓవర్‌కు భారీ షాట్‌కు యత్నించి హోల్డర్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 39 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. 12 ఓవర్లో కోహ్లీ(18) ఔట్ అయ్యాడు. కాగా, నామమాత్రమైన మూడో వన్డే ఫిబ్రవరి 11న (శుక్రవారం) జరుగనుంది.
ఇదీ చూడండి: IND VS WI: సూర్యకుమార్ హాఫ్‌సెంచరీ.. విండీస్ లక్ష్యం ఎంతంటే?