IND Vs WI Records : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా ప్లేయర్లు మరింత జోరు పెంచి ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. తొలి రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 288/4 స్కోరుతో కొనసాగుతోంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ , యశస్వి జైస్వాల్ అర్ధ శతకాలు బాదారు.
-
Captain Rohit Sharma is presented with a plaque to commemorate the 100th Test between India and West Indies.#WIvIND pic.twitter.com/99pnoRUK8S
— BCCI (@BCCI) July 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Captain Rohit Sharma is presented with a plaque to commemorate the 100th Test between India and West Indies.#WIvIND pic.twitter.com/99pnoRUK8S
— BCCI (@BCCI) July 20, 2023Captain Rohit Sharma is presented with a plaque to commemorate the 100th Test between India and West Indies.#WIvIND pic.twitter.com/99pnoRUK8S
— BCCI (@BCCI) July 20, 2023
ఇక జైస్వాల్.. తన ఫామ్‌ను కొనసాగిస్తూ విండీస్‌తో రెండో టెస్టులోనూ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలి టెస్ట్‌లో శతాకాన్ని బాదిన ఈ ప్లేయర్.. రెండో టెస్ట్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. అంతే కాకుండా అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. జైస్వాల్‌తో పాటు మరికొందరు ప్లేయర్స్ కూడా పలు రికార్డులను తమ ఖాతాల్లోకి వేసుకున్నారు. అవేంటంటే..
- తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 171 పరుగులతో పాటు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి 57 పరుగులు చేశాడు. అలా మొత్తం 228 పరుగులు సాధించాడు. దీంతో ఓపెనర్‌గా తొలి రెండు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్‌గా అవతరించాడు. ఈ లిస్ట్‌లో రోహిత్ శర్మ (303) టాప్ పొజిషన్లో ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ రోహిత్‌దే అగ్రస్థానం కాగా.. సిడ్నీ బార్న్స్ (265), డేవిడ్ లాయిడ్ (260), బిల్ వుడ్‌ఫుల్ (258), నిషాన్ మధుసంక (234) ఈ జాబితాలో యశస్వి కంటే ముందున్నారు. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా (224), గ్రేమ్ స్మిత్ (224) ఉండటం గమనార్హం.
- భారత్ తరఫున తొలి రెండు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా జైస్వాల్ మరో రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలోనూ అతనకి కంటే ముందు రోహిత్ శర్మ (303) ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో సౌరభ్ గంగూలీ (267), శిఖర్ ధావన్ (210) ఉన్నారు. అయితే, అరంగేట్రం చేసిన తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా శిఖర్ ధావన్ (187 పరుగులు) కొనసాగుతున్నాడు.
-
That's Stumps on Day 1 of the 2⃣nd #WIvIND Test!
— BCCI (@BCCI) July 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Solid show with the bat from #TeamIndia 👍👍
8️⃣7️⃣* for @imVkohli
8️⃣0️⃣ for Captain @ImRo45
5️⃣7️⃣ for @ybj_19
3️⃣6️⃣* for @imjadeja
We will see you tomorrow for Day 2️⃣ action!
Scorecard ▶️ https://t.co/d6oETzoH1Z pic.twitter.com/FLV0UzsKOT
">That's Stumps on Day 1 of the 2⃣nd #WIvIND Test!
— BCCI (@BCCI) July 20, 2023
Solid show with the bat from #TeamIndia 👍👍
8️⃣7️⃣* for @imVkohli
8️⃣0️⃣ for Captain @ImRo45
5️⃣7️⃣ for @ybj_19
3️⃣6️⃣* for @imjadeja
We will see you tomorrow for Day 2️⃣ action!
Scorecard ▶️ https://t.co/d6oETzoH1Z pic.twitter.com/FLV0UzsKOTThat's Stumps on Day 1 of the 2⃣nd #WIvIND Test!
— BCCI (@BCCI) July 20, 2023
Solid show with the bat from #TeamIndia 👍👍
8️⃣7️⃣* for @imVkohli
8️⃣0️⃣ for Captain @ImRo45
5️⃣7️⃣ for @ybj_19
3️⃣6️⃣* for @imjadeja
We will see you tomorrow for Day 2️⃣ action!
Scorecard ▶️ https://t.co/d6oETzoH1Z pic.twitter.com/FLV0UzsKOT
-
- యశస్వి జైస్వాల్‌తో కలిసి రోహిత్ రెండోసారి వంద పరుగుల (139) భాగస్వామ్యం నిర్మించాడు. విండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా పర్యాటక జట్టు ఓపెనింగ్ బ్యాటర్లు సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో రోహిత్ - యశస్వి జోడీ మూడో స్థానం దక్కించుకుంది.
- విండీస్‌తో రెండో టెస్టులోనూ రోహిత్ (80) హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా టెస్టు ఫార్మాట్‌లో 2000 పరుగుల మైలురాయిని అతడు దాటేశాడు.
-
Milestone 🔓 - 2000 Test runs as an opener and counting for Captain @ImRo45 👏👏#WIvIND pic.twitter.com/rwbzgQ8v3b
— BCCI (@BCCI) July 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Milestone 🔓 - 2000 Test runs as an opener and counting for Captain @ImRo45 👏👏#WIvIND pic.twitter.com/rwbzgQ8v3b
— BCCI (@BCCI) July 20, 2023Milestone 🔓 - 2000 Test runs as an opener and counting for Captain @ImRo45 👏👏#WIvIND pic.twitter.com/rwbzgQ8v3b
— BCCI (@BCCI) July 20, 2023
- నాలుగోస్థానంలో అత్యధిక పరుగులు సాధించిన ఐదో బ్యాటర్ విరాట్ కోహ్లీగా చరిత్రకెక్కాడు. ప్రస్తుతం విండీస్‌తో రెండో టెస్టులో క్రీజులో ఉన్న విరాట్ (87*) హాఫ్ సెంచరీ చేసి కొనసాగుతున్నాడు. దీంతో ఇప్పటి వరకు 7,097 పరుగులు చేసినట్లయింది. ఈ జాబితాలో సచిన్ (13,492 పరుగులు), మహేల జయవర్థనె (9,509), కలిస్ (9,033), బ్రియాన్ లారా (7,535) ఉన్నారు.
-
3⃣0⃣th Test FIFTY for Virat Kohli 🙌 🙌
— BCCI (@BCCI) July 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
He also completes a half-century stand with @imjadeja 🤝#TeamIndia inching closer to 240.
Follow the match ▶️ https://t.co/d6oETzoH1Z#WIvIND pic.twitter.com/yG4z7I4epM
">3⃣0⃣th Test FIFTY for Virat Kohli 🙌 🙌
— BCCI (@BCCI) July 20, 2023
He also completes a half-century stand with @imjadeja 🤝#TeamIndia inching closer to 240.
Follow the match ▶️ https://t.co/d6oETzoH1Z#WIvIND pic.twitter.com/yG4z7I4epM3⃣0⃣th Test FIFTY for Virat Kohli 🙌 🙌
— BCCI (@BCCI) July 20, 2023
He also completes a half-century stand with @imjadeja 🤝#TeamIndia inching closer to 240.
Follow the match ▶️ https://t.co/d6oETzoH1Z#WIvIND pic.twitter.com/yG4z7I4epM
-
- అంతర్జాతీయ క్రికెట్‌లో పాతిక వేలకుపైగా పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గానూ కోహ్లీ నిలిచాడు. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కలిస్‌ను (25,534) అధిగమించిన విరాట్ 25,548 పరుగులతో కొనసాగుతున్నాడు. అయితే ఈ లిస్ట్‌లోనూ 34,357 పరుగులతో సచిన్ టాపర్‌గా ఉన్నాడు.
- ఇంగ్లాండ్ ఆటగాళ్లు బాయ్‌కాట్ - డెన్నిస్ అమిస్ (1974లో) 229 పరుగులు, ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆర్థూర్ -మెక్‌డొనాల్డ్ (1955లో) 191 పరుగులు జోడించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">