ETV Bharat / sports

లంకకు భారీ షాక్​.. భారత్​తో సిరీస్​కు స్టార్​ ఆల్​రౌండర్​ దూరం - కొవిడ్

Ind vs SL: భారత్​తో టీ20 సిరీస్​ జరగనున్న వేళ శ్రీలంక జట్టుకు షాక్​ తగిలింది. ఆ జట్టు ఆల్​రౌండర్​ వనిందు హసరంగ మరోసారి కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడు ఐసోలేషన్​కే పరిమితంకానున్నాడు.

India vs Sri Lanka
Wanindu Hasaranga
author img

By

Published : Feb 23, 2022, 2:13 PM IST

Ind vs SL: టీమ్​ఇండియా పర్యటన నేపథ్యంలో శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్​రౌండర్​ వనిందు హసరంగ కరోనా బారినపడ్డాడు. దీంతో ఫిబ్రవరి 24 నుంచి జరగబోయే మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​కు అతడు దూరం కానున్నాడు.

ఇదివరకే కొవిడ్ బారినపడి ఐసోలేషన్​లో ఉన్న హసరంగ.. ఫిబ్రవరి 22న చేసిన పరీక్షల్లోనూ పాజిటివ్​గా తేలాడు. కాగా, ఈ సిరీస్​కు ఇద్దరు భారత ఆటగాళ్లు కూడా దూరమయ్యారు. గాయాల కారణంగా పేసర్​ దీపక్ చాహర్​, సూర్యకుమార్​ యాదవ్​ తప్పుకున్నారు.

ఇదీ షెడ్యూల్​..

లంకతో స్వదేశంలో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది టీమ్​ఇండియా. ఫిబ్రవరి 24, 26, 27వ తేదీల్లో టీ20లు.. మార్చి 4-8 వరకు తొలి టెస్టు, మార్చి 12-16 వరకు రెండో టెస్టు మ్యాచ్‌ జరగనుంది.

ఇదీ చూడండి: IPL 2022: దిల్లీ క్యాపిటల్స్​ కోచ్​లుగా షేన్ వాట్సన్​, అగార్కర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.