ETV Bharat / sports

IND vs SA series: భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ వాయిదా - undefined

IND vs SA series: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన టీ20 సిరీస్ వాయిదా పడింది. ప్రస్తుత పర్యటనలో కేవలం వన్డే, టెస్టు సిరీస్ మాత్రమే జరుగుతుందని బీసీసీఐ వెల్లడించింది.

IND vs SA
IND vs SA
author img

By

Published : Dec 4, 2021, 11:58 AM IST

Updated : Dec 4, 2021, 1:09 PM IST

IND vs SA series: దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో అక్కడ టీమ్‌ఇండియా పర్యటనపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటనను యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది. కోల్‌కతాలో నిర్వహించిన బీసీసీఐ 90వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇన్నాళ్లు టీమ్‌ఇండియా పర్యటనపై నెలకొన్న గందరగోళానికి తెరపడినట్లయింది. ప్రస్తుతానికి మూడు టెస్టులు, మూడు వన్డేలను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని స్సష్టం చేసింది. టీ20 సిరీస్​ను మాత్రం వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో.. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే.. టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా బయలుదేరనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు 3 టెస్టులు, 3 వన్డేలు ఆడనున్నాయి. మొదటి టెస్టు డిసెంబరు 17న జొహానెస్‌ బర్గ్‌ వేదికగా ప్రారంభం కానుంది.

Last Updated : Dec 4, 2021, 1:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.