IND vs ENG World Cup 2023 : 2023 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 29) భారత్.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు లఖ్‌నవూ స్టేడియం వేదిక కానుంది. అయితే ప్రస్తుత మెగాటోర్నీలో ఓటమి అనేదే లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతోంది టీమ్ఇండియా. మరోవైపు ఇంగ్లాండ్.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదా నిలబెట్టుకోవడం అటుంచితే, కనీసం సెమీస్‌కు వచ్చే ఛాన్స్‌లు కూడా దూరం చేసుకుంటోంది. ఆదివారం నాటి మ్యాచ్‌లో విజయం సాధించి.. సెమీస్‌కు మరింత చేరువ కావాలని భారత్ ఉవ్విళ్లూరుతుంటే.. హ్యాట్రిక్ ఓటముల తర్వాత అయినా గెలుపు బాట పట్టాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది.
టీమ్ఇండియా ఎలా ఉందంటే?
కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ప్రస్తుతం అత్యంత పటిష్ఠంగా ఉంది. శుభ్‌మన్ గిల్, రోహిత్, విరాట్ కోహ్లీతో టాప్ఆర్డర్ బలంగా ఉంటే.. శ్రేయస్ అయ్యర్, రాహుల్‌తో మిడిలార్డర్ దృఢంగా ఉంది. ఇప్పటివరకూ ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఈ ఐదుగురే జట్టును దాదాపు విజయతీరాలకు చేర్చారు. తొలి మ్యాచ్ మినహా.. భారత్‌కు రోహిత్, గిల్ అన్ని మ్యాచ్‌ల్లో శుభారంభాలు ఇచ్చారు.
ఇక హార్దిక్ గైర్హాజరీలో గత మ్యాచ్‌లో జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. దీంతో అతడికి మేనేజ్మెంట్ మరో ఛాన్స్ ఇవ్వవచ్చు. ఆల్‌రౌండర్ జడేజా, సూర్యతో నెంబర్ 6,7 స్థానాల్లో కూడా భారత్ బ్యాటింగ్ ఆర్డర్ డీప్‌గా ఉంది. ఇక మెయిన్ బౌలర్లుగా కుల్దీప్, బుమ్రా జట్టులో ప్లేస్ ఖాయం చేసుకోగా.. మరో రెండు స్థానాల కోసం షమీ, సిరాజ్, శార్దూల్ మధ్య పోటీ ఉంది.
అశ్విన్‌కు లైన్ క్లియర్!.. లఖ్‌నవూ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. దీంతో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శార్దూల్ స్థానంలో అశ్విన్ తీసుకొని.. జడేజా, కుల్దీప్, అశ్విన్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిదే అవకాశం ఉంది.
-
KL Rahul is back to a ground that has given him life lessons & bittersweet memories 🏟️
— BCCI (@BCCI) October 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
On Sunday, he wants to make memories that he'll remember only for the good 👌👌
Muskuraiye, KL Rahul Lucknow mein hai 🤗
WATCH 🎥🔽 - By @28anand #TeamIndia | #CWC23 | #INDvENG
">KL Rahul is back to a ground that has given him life lessons & bittersweet memories 🏟️
— BCCI (@BCCI) October 28, 2023
On Sunday, he wants to make memories that he'll remember only for the good 👌👌
Muskuraiye, KL Rahul Lucknow mein hai 🤗
WATCH 🎥🔽 - By @28anand #TeamIndia | #CWC23 | #INDvENGKL Rahul is back to a ground that has given him life lessons & bittersweet memories 🏟️
— BCCI (@BCCI) October 28, 2023
On Sunday, he wants to make memories that he'll remember only for the good 👌👌
Muskuraiye, KL Rahul Lucknow mein hai 🤗
WATCH 🎥🔽 - By @28anand #TeamIndia | #CWC23 | #INDvENG
పడుతూనే ఇంగ్లాండ్ ప్రయాణం..
ప్రస్తుత టోర్నీలో ఇంగ్లాండ్.. ఆశించిన స్థాయిలో ప్రదర్శన చూపడం లేదు. ఓటమితోనే టోర్నీని ఆరంభించిన ఇంగ్లాండ్.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై నెగ్గి గాడిలో పడ్డట్టు కనిపించింది. కానీ, ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములు మూటగట్టుకుంది. అందులో పసికూన అఫ్గానిస్థాన్ చేతిలో ఓటమిని ఇంగ్లీష్ జట్టు ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేపోతున్నారు. తర్వాత వరుసగా సౌతాఫ్రికా, శ్రీలంకతోనూ చిత్తుగా ఓడి.. పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో ప్లేస్‌లో ఉంది. అయితే బెయిర్ స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, బట్లర్‌తో కూడిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను తక్కువ అంచనా వేయలేం. కానీ, భీకర ఫామ్‌లో ఉన్న భారత బౌలర్లు.. వీరి దూకుడుకు కళ్లెం వేసే అవకాశం లేకపోలేదు.
ప్రతీకారానికి వేళాయే!
అక్టోబర్ 29 నాటి మ్యాచ్‌తో ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌కు మంచి ఛాన్స్ ఉంది. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో ఇంగ్లాండ్.. భారత్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించి ఇంటిబాట పట్టించింది. అయితే ప్రస్తుత ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక మ్యాచ్‌లోనే నెగ్గిన ఇంగ్లాండ్‌కు ఆదివారం మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఇంగ్లాండ్ సెమీస్ రేస్‌లో ఉంటుంది. ఒకవేళ ఓడితే.. అనధికారంగా డిఫెండింగ్ ఛాంప్ టోర్నీ నుంచి నిష్ర్కమిస్తుంది. అందుకే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఎలాగైనా.. గెలిచి ఇంగ్లాండ్‌ను దెబ్బకు దెబ్బ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
2023 World Cup Records : మెగాటోర్నీ మొనగాళ్లు వీరే.. రోహిత్, డికాక్, విరాట్ ఇంకా ఎవరంటే?
ENG vs SL World Cup 2023 : ఇంగ్లాండ్‌కు మరో షాక్..శ్రీలంక చేతిలో ఓటమి.. సెమీస్ నుంచి ఔట్!