ETV Bharat / sports

ఇంగ్లాండ్‌ గడ్డపై బుమ్రా మరో రికార్డు - బుమ్రా రికార్డు

IND VS ENG Bumrah record: టీమ్​ఇండియా తాత్కాలిక కెప్టెన్​ బుమ్రా.. మరో ఘనత సాధించాడు. ఇంగ్లాడ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

bumrah
బుమ్రా
author img

By

Published : Jul 4, 2022, 3:54 PM IST

IND VS ENG Bumrah record: టెస్టు క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టంచిన టీమ్​ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ బుమ్రా.. మరో ఘనత సాధించాడు. ఇంగ్లాడ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. భారత్‌ - ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఐదో టెస్టు జరుగుతోంది. గతేడాదే ఈ సిరీస్‌ ప్రారంభమవ్వగా.. కొవిడ్‌ కారణంగా ఐదో టెస్టు వాయిదా పడింది. తాజాగా జరుగుతోన్న ఈ టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 68 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇప్పటివరకు ఈ సిరీస్‌లో బుమ్రా తన ఖాతాలో 21 వికెట్లు సాధించాడు.

ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఇప్పటివరకు భువనేశ్వర్‌ కుమార్‌ పేరిట ఉన్న రికార్డును బుమ్రా అధిగమించాడు. భువీ 2014లో ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌లో 19 వికెట్లు పడగొట్టాడు. కాగా.. ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్ ఇంకా మిగిలి ఉండటంతో బుమ్రా ఖాతాలో మరిన్ని వికెట్లు పడగొట్టే అవకాశముంది.

ఇంగ్లాండ్ టెస్టు సీరిస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..

బుమ్రా : 21 వికెట్లు (2021-22)

భువనేశ్వర్‌ కుమార్‌ : 19 వికెట్లు (2014)

జహీర్‌ ఖాన్‌ : 18 వికెట్లు (2007)

ఇషాంత్‌ శర్మ : 18 వికెట్లు (2018)

సుభాష్‌ గుప్తా : 17 వికెట్లు (1959)

ఐదో టెస్టులోనే బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌కు బుమ్రా చుక్కలు చూపించాడు. ఈ ఓవర్లో ఏకంగా 35 పరుగులు రాబట్టి టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకముందు వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా 2003లో (దక్షిణాఫ్రికా బౌలర్‌ పీటర్సన్‌) ఓవర్లలో 28 పరుగులు చేయగా.. బుమ్రా ఆ రికార్డును బద్దలుకొట్టాడు. కాగా.. రోహిత్‌ శర్మ కొవిడ్‌ బారినపడటంతో ఈ టెస్టు మ్యాచ్‌కు బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు.

ఇదీ చూడండి: మసాజ్​ చేయమని, బట్టలు ఉతకమని టార్చర్​ పెట్టారు: స్టార్​ స్ప్రింటర్​ ద్యుతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.