బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో టీమ్ఇండియా విజేతగా నిలిచింది. 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా పుజారాను ఎంపిక చేశారు. అయితే ఈ అవార్డు పుజారాకు వరించడం చర్చనీయాంశంగా మారింది.
విషయానికొస్తే.. అతడు 74 సగటుతో 222 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచాడు. అందులో ఓ సెంచరీ, అర్ధశతకం ఉన్నాయి. కానీ ఇవి రెండూ తొలి మ్యాచ్ (90, 102 నాటౌట్)లో సాధించినవే. రెండో టెస్టులో అతని స్కోర్లు వరుసగా 24, 6 మాత్రమే. ఈ మ్యాచ్‌లో అతను పూర్తిగా విఫలమయ్యాడు. జట్టును ఆదుకోవాల్సింది పోయి వికెట్ పారేసుకుని మరింత ఇబ్బందుల్లోకి నెట్టాడు. దీంతో అతనికి 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు ఎలా ఇస్తారనే ప్రశ్నలు తలెత్తాయి.
ఇదే సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ రెండు మ్యాచ్‌ల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానం (202)లో ఉన్నాడు. అతని సగటు 101. అతను జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులతో జట్టు మెరుగైన స్కోరు చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. రెండో టెస్టులో (87, 29 నాటౌట్)నూ నిలకడైన ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పంత్‌తో కలిసి కీలక భాగస్వామ్యంతో జట్టుకు ఆధిక్యం దక్కేలా చూశాడు. ఇక ఛేదనలో ఓటమి భయం వెంటాడుతుండగా.. తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాడు. ఎలాంటి తడబాటు లేకుండా జట్టును విజయతీర్చాలకు చేర్చాడు. దీంతో శ్రేయస్‌కు కాకుండా పుజారాకు ఆ అవార్డు ఎందుకు ఇచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఇదీ చూడండి: కుల్‌దీప్‌ను తప్పించడం సరైందే.. అందుకు బాధ లేదు : కేఎల్ రాహుల్