ETV Bharat / sports

తీవ్రంగా గాయపడ్డ క్రికెటర్​.. మ్యాచ్​ మధ్యలోనే స్ట్రెచర్​పై ఆస్పత్రికి - డొమినిక్ డ్రేక్స్ గాయాలు

అంతర్జాతీయ టీ20 లీగ్‌లో గల్ఫ్ జెయింట్స్ ఆటగాడు, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డొమినిక్ డ్రేక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్​ చేస్తున్న సమయంలో బాల్​ను పట్టుకునేందుకు ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యాడు.

ILT20 2023
Gulf Giants Dominic Drakes
author img

By

Published : Feb 7, 2023, 12:40 PM IST

అంతర్జాతీయ టీ20 లీగ్‌లో భాగంగా షార్జా వారియర్స్, గల్ఫ్ జెయింట్స్​కు మధ్య మ్యాచ్​ జరుగుతున్న సమయంలో మైదానంలో ఓ ప్రమాదం జరిగింది. ఈ మ్యాచ్‌లో గల్ఫ్ జెయింట్స్ ఆటగాడు, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డొమినిక్ డ్రేక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన సిబ్బంది అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే?
వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డొమినిక్ డ్రేక్స్ ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో గల్ఫ్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇందులో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్​లో షార్జా వారియర్స్ ఇన్నింగ్స్‌ సమయంలో ఆరో ఓవర్‌ వేసిన బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో మోయిన్‌ అలీ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ అది కాస్తా అదుపుతప్పి గాల్లోకి ఎగిరింది. అయితే బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న డ్రేక్‌ బాల్​ పట్టుకునేందుకు పరిగెత్తుకుంటూ వచ్చి డైవింగ్‌ క్యాచ్‌ను అందుకుని కింద పడ్డాడు.. అలా అతడి ముఖం నేలకు బలంగా తాకింది. దీంతో తీవ్ర గాయాలపాలైన డ్రేక్​ను గమనించిన మిగతా ప్లేయర్స్​ అతడి వద్దకు పరుగులు తీశారు. ఆ తర్వాత మెడికల్‌ సిబ్బంది అతన్ని స్ట్రెచర్‌పై హూటాహూటిన ఆస్పత్రికి తరిలించారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. షార్జా వారియర్స్‌ పై గల్ఫ్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన షార్జా 107 పరుగులకే కుప్పకూలింది. గల్ఫ్ జెయింట్స్ బౌలర్లలో డేవిడ్‌ వైస్ ఐదు వికెట్లతో షార్జాను వెనక్కి నెట్టి.. బ్రాత్‌వైట్ రెండు, సంచిత్‌ శర్మ,హెల్మ్‌ చెరో వికెట్‌ సాధించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన జెయింట్స్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.