ETV Bharat / sports

Wasim Akram on Babar : 'కోహ్లీ జెర్సీలు అక్కడే తీసుకోవాలా?'​.. బాబర్​పై అక్రమ్​ ఫైర్​ - ind vs pak world cup 2023

Wasim Akram on Babar : ప్రపంచ కప్​లో భారత్​తో తలపడిన మ్యాచ్‌లో పాక్ ఓడిపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచ్‌ ముగిశాక టీమ్ఇండియా ప్లేయర్​ విరాట్‌ కోహ్లీ నుంచి పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ జెర్సీలు తీసుకోవడాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ వసీమ్‌ అక్రమ్‌ తప్పుబట్టాడు. ఇంకా ఏమన్నాడంటే?

Wasim Akram on Babar
Wasim Akram on Babar
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 8:37 AM IST

Wasim Akram on Babar : ప్రపంచకప్​లో భారత్​ చేతిలో పాకిస్థాన్ పరాజయంపై ఆ జట్టు మాజీ కెప్టెన్లు విమర్శలు చేస్తున్నారు. మ్యాచ్​ ముగిశాక భారత్ స్టార్ విరాట్ కోహ్లీ నుంచి పాక్ కెప్టెన్​ బాబర్​ అజామ్​ జెర్సీలు తీసుకోవడాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్ వసీమ్​ అక్రమ్​ తప్పుబట్టాడు. మ్యాచ్ అనంతరం విరాట్​ కోహ్లీ, బాబర్​ గ్రౌండ్​లో ముచ్చటించారు. ఆ సందర్భంగా టీమిండియా జెర్సీని కోహ్లీ నుంచి బాబర్ తీసుకున్నాడు. దీనిపై మాజీ కెప్టెన్​ వసీమ్​ అక్రమ్ అందరి ముందు అలా తీసుకోవటం ఆశ్యర్యం కలిగించిందని అన్నాడు. "మ్యాచ్​ పరాజయంతో పాక్​ ఫ్యాన్స్ అంతా విచారంలో ఉంటే.. బాబార్ కోహ్లీ ఇచ్చిన జెర్సీని అలా తీసుకోవటం సరైనది కాదు. మీ అంకుల్​ కుమారుడు.. కోహ్లీ జెర్సీ కావాలని అడిగి ఉంటే.. డ్రెసింగ్​ రూమ్​లో తీసుకొని ఉండాల్సింది. ఇలా బహిరంగా కాదు" అని వసీమ్​ అక్రమ్​ విమర్శించాడు.

ప్రపంచకప్​లో భారత్​ చేతిలో పాకిస్థాన్ పరాజయం తనకు చాలా బాధ కలిగిస్తోందని ఆ జట్టు మాజీ కెప్టెన్​ రమీజ్ రజా అన్నాడు. "ఇదో పెద్ద మచ్చలాగా మిగిలిపోతుంది. అన్ని విభాగాల్లోనూ పాక్​ దారుణంగా విఫలమైంది. గెలుపును పొందలేని పరిస్థితి లేనప్పుడు కనీసం పోటీ ఇవ్వాలి. పాక్ కనీసం ఆ పని కూడా చేయలేకపోయింది. భారత్​కు అభిమానుల మద్దతు భారీగానే ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకుని గెలవాలి లేదా పోటీ ఇవ్వాలి. భారత్​లో ఆడేటప్పుడు 'చోకర్స్' అని అనిపించుకోవటం పాక్​కు మంచిది కాదు. ఇండియా జట్టుకు ఈ మ్యాచ్​ అంత తేలికేం కాలేదు". అని రమీజ్​ రజా పేర్కొన్నాడు.

పాకిపై భారత్​ విజయం సాధించిన తీరుపై మరో మాజీ ఆటగాడు షోయబ్‌ అక్తర్‌ ఈ విధంగా స్పందించాడు. "టీమిండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ.. పాకిస్థాన్‌ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడన్నాడు. "పాక్‌ బౌలింగ్‌ను రోహిత్‌ లెక్కే చేయలేదు. అతడి ఆట ప్రతీకారం తీర్చుకున్నట్లుగా సాగింది. గత రెండేళ్లుగా సరిగా రాణించలేనందుకు.. ఈ సారి భిన్నమైన షాట్లు కొట్టాడు. అతడే ఓ సైన్యంలా కనిపించాడు. పాకిస్థాన్‌ ప్రదర్శన తీవ్ర నిరాశను కలిగించింది" అని అక్తర్‌ చెప్పాడు.

ODI World Cup 2023 IND VS PAK : ఆ మజా మళ్లీ దొరకదా?.. భారత్ - పాక్ మ్యాచుల్లో కిక్ ఏది బాసూ!

ODI WorldCup 2023 AFG VS ENG : జగజ్జేత ఇంగ్లాండ్​కు షాకిచ్చిన ఆప్గానిస్థాన్​.. ప్రపంచకప్​లో సంచలనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.