ETV Bharat / sports

ICC World Cup 2023 : భారత్​-పాక్ హై ఓల్టేజ్​ మ్యాచ్​.. ఎవరి బలం ఎంత?.. అదే రిపీట్​ అవుతుందా? - టీమ్​ఇండియా పాకిస్థాన్ మ్యాచ్​

ICC World Cup 2023 IND VS PAK : ఎప్పుడెప్పుడా అని క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్​ మహా సమరం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023కు వేళైంది. అయితే ఈ మెగాటోర్నీలో ఎన్ని మ్యాచులు జరిగినా అందరి కళ్లు భారత్​-పాక్​ మ్యాచ్​ పైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను, రికార్డులను ఓ సారి చూద్దాం..

IND PAK Match
IND PAK Match
author img

By

Published : Jun 27, 2023, 4:09 PM IST

ICC World Cup 2023 IND VS PAK : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్​ మహా సమరం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023కు ముహూర్తం ఖరారైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఈ ఏడాది అక్టోబర్​ 5న ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు పోటీ పడనున్న ఈ విశ్వ సమరంలో టీమ్​ఇండియా తమ తొలి మ్యాచ్​ను ఆక్టోబర్​ 8న ఆస్ట్రేలియా​తో తలపడనుంది. అయితే ఈ వరల్డ్ కప్​ మొత్తం ఒకెత్తు అయితే.. భారత్​ పాకిస్థాన్ మ్యాచ్​ మరోఎత్తు. దాయాది జట్టుతో జరగబోయే ఈ హైఓల్టేజ్​ మ్యాచ్​.. అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్​ 15న జరగనుంది​. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను, రికార్డులను ఓ సారి చూద్దాం..

అదే రిపీట్​ అవుతుందా..?

1992, 1996, 1999, 2003, 2011, 2015, 2019 వరల్డ్​ కప్​ల్లో ఏడుసార్లు భారత్​, పాకిస్థాన్​ తలపడ్డాయి. ఇందులో ఏ ఒక్క మ్యాచ్​లోనూ పాకిస్థాన్​ గెలవలేదు. 2019లో చివరిసారిగా పాకిస్థాన్​ను 89 పరుగులతో​ భారత్​ చిత్తుగా ఓడించింది. అన్ని మ్యాచ్​ల్లో భారత్​ పైచేయి సాధించింది. ఇకపోతే టీ20 వరల్డ్ కప్ 2022​లో చివరి సారిగా భారత్​ పాకిస్థాన్ తలపడ్డాయి. ఆ మ్యాచ్​లోనూ భారత్​ గెలిచింది. అంతకుముందు జరిగిన ఆసియా కప్​లో రెండు సార్లు పాక్​ను ఎదుర్కొన్న భారత్.. మొదటి మ్యాచ్​లో గెలిచింది. రెండో దాంట్లో మాత్రం పాక్​ గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఇక, గత మూడు వరల్డ్ కల్​లో ఆతిథ్యమిచ్చిన దేశాలే టైటిల్​ సాధించాయి. ఇవే సెంటిమెంట్​లు రిపీట్ అయితే.. పాకిస్థాన్​పై ఇండియా మరోసారి గెలవడం పక్కా. అలానే టీమ్​ఇండియా వరల్డ్​ కప్​ టైటిల్​ను ముద్దాడుతుంది.

ఎవరి బలం ఎంత..

చివరిసారిగా 2011లో జరిగిన వరల్డ్ కప్​నకు భారత్ ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో మొదటి నుంచి అద్భుత ప్రదర్శన చేసి టీమ్​ఇండియా.. 28 ఏళ్ల తర్వాత రెండో వరల్డ్​ కప్​ను ముద్దాడింది. ఆ తర్వాత రెండు వరల్డ్​ కప్​లు జరిగినా.. భారత్​ మూడో కప్పు సాధించలేకపోయింది. ఇప్పుడు మరోసారి టైటిల్​ ఫేవరెట్​గా బరిలోకి దిగుతోంది భారత్.

టీమ్​ఇండియా బలాబలాల విషయానికొస్తే.. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఎప్పుడూ మనదే పైచేయి ఉంటుంది. ముఖ్యంగా సొంతగడ్డపై సిరీస్‌లంటే మనవాళ్లు విజృంభిస్తారు. భీకర ఫామ్‌తో మన దేశ పర్యటనకు వచ్చే జట్లకు గర్వభంగం చేసి మరీ పంపిస్తారు. అలానే గత కొన్నేళ్లలో విదేశాల్లో కూడా అడపాదడపా కొన్ని విజయాలు సాధిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే ఐసీసీ నిర్వహించే టోర్నీల టీమ్​ఇండియా గెలిచి సుమారు 10 ఏళ్లు అవుతోంది. చివరిసారిగా మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో 2013లో ఛాంపియన్స్ ట్రోఫీను భారత జట్టు ముద్దాడింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్క మేజర్ టోర్నీలోనూ భారత జట్టు విజయం సాధించలేకపోయింది. ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రెండు సార్లు ఫైనల్ చేరిన టీమ్​ఇండియా.. అసలు సమరంలో (న్యూజిలాండ్​, ఆస్ట్రేలియాపై) చేతులత్తేశారు. అయితే తాజా టోర్నీ సొంత మైదానాల్లో ఆడుతుండడం వల్ల భారత జట్టుకు కలిసి వస్తుందని అభిమానులతో పాటు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

బ్యాటింగ్​లో టాప్​ ఆర్డర్​లో కోహ్లీ, గిల్ మంచి ఫామ్​లో ఉన్నారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్​ లేమితో ఇబ్బంది పడుతున్నారు. అతడు కాస్త ఫైర్​గా​ ఆడితే తిరుగుండదు. ఇక మిడిలార్డర్​లో గాయాలతో దూరమైన శ్రేయస్ అయ్యర్​, కేఎల్ రాహుల్​ తిరిగి వచ్చే అవకాశముంది. వారు చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్నారు. వారు చెలరేగి ఆడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వికెట్ కీపర్​గా.. రాహుల్​నే కొనసాగిస్తారా లేదా శాంసన్, ఇషాన్ కిషన్​కు చోటిస్తారా అనేది చూడాలి. ఇక ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ప్రస్తుతం బాగానే రాణిస్తున్నాడు. అతడు కూడా తన ఫామ్​ను కొనసాగిస్తే తిరుగుండదు.

బౌలర్లలో గాయంతో చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా తిరిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడు ఈ టోర్నీకి ముందే ఐర్లాండ్​ సిరీస్​లో బరిలోకి దిగుతాడని అంటున్నారు. అతడు వస్తే ఉమ్రాన్​ మాలిక్​కు అవకాశం ఉండదు. సిరాజ్​ ఇప్పటికే వన్డేల్లో నెం.1 బౌలర్​గా రాణిస్తున్నాడు. షమీ కూడా మంచి ఫామ్​లోనే ఉన్నాడు. కుల్దీప్​ కూడా మంచిగా రాణిస్తే ఇక తిరుగుండదు.

  • Proud moment for India! Hosting the ICC Men's Cricket World Cup for the fourth time is an incredible honor. With 12 cities as the backdrop, we'll showcase our rich diversity and world-class cricketing infrastructure. Get ready for an unforgettable tournament! #CWC2023 @ICC @BCCI pic.twitter.com/76VFuuvpcK

    — Jay Shah (@JayShah) June 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పాకిస్థాన్​ కూడా బలంగానే.. మరోవైపు, చివరి 5 వన్డే మ్యాచ్​ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన పాకిస్థాన్ జట్టు​ కూడా బలంగానే ఉంది. వన్డేల్లో నంబర్​వన్​ ర్యాంకర్​ బాబర్ అజామ్​ సారథ్యంలో మహ్మద్​ రిజ్వాన్, ఇమామ్​ ఉల్​ హక్​, పఖర్​ జమాన్​ లాంటి కీలక బ్యాటర్లు.. షహీన్​ అఫ్రిదీ, హారిస్​ రావుఫ్​స, నసీం షా లాంటి స్టార్​ బౌలర్లతో పాకిస్థాన్​ కూడా భారత్​కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్థాన్​ వరల్డ్​ టీమ్ సభ్యుడు వసీం అక్రం తమ జట్టును బలంగా ఉందని చెబుతున్నాడు. 'మాకు మంచి వన్డే టీమ్ ఉంది. ఆ జట్టుకు ఈ తరంలో గొప్ప బ్యాటర్​ అయిన బాబర్ అజామ్​ సారథ్యం వహిస్తున్నాడు. వారు ఫిట్​గా ఉన్నంతకాలం, వారి ప్లాన్​ ప్రకారం ఆడినంత కాలం.. ఈ వరల్డ్ కప్​లో మంచి ప్రదర్శన చేస్తారు. ఎందుకంటే మా టీమ్​ సబ్​కాంటినెంట్​ లాంటి పిచ్​ల్లో బాగా ఆడింది' అని అన్నాడు.

అతిపెద్ద స్టేడియం.. అత్యధిక జనం..

ఇండియా, పాకిస్థాన్‌ మధ్య జరిగే హైఓల్టేజ్​ మ్యాచ్‌లకు ఎప్పుడూ ఫుల్ క్రేజ్‌ ఉంటుంది. ఈ రెండు జట్లు తలపడినప్పుడు వేల మంది ప్రేక్షకుల ఈలలు, గోలలతో స్టేడియాలు దద్దరిల్లిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది క్రికెట్‌ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోతారు. ఆసియా కప్​ 2022లో మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​ వేదికగా జరిగిన భారత్​, పాకిస్థాన్​ మ్యాచ్​ను ఏకంగా 90,293 మంది వీక్షించారు. అయితే ఈ సారి అక్డోబర్​ 15న జరగబోయే భారత్​, పాక్​ మ్యాచ్​కు వేదిక కానున్న నరేంద్ర మోదీ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 132,000. ఈ సారి కూడా మొత్తం టికెట్లు అమ్ముడుపోతాయని అంచనా. ఇదే జరిగితే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన మ్యాచ్​గా చరిత్రలో నిలిచిపోతుంది.

ఇదీ చూడండి :

మోదీ స్టేడియంలో భారత్- పాక్ మ్యాచ్​.. ICC వరల్డ్​ కప్​ షెడ్యూల్ విడుదల

అంతరిక్షంలోకి వరల్డ్​ కప్​ ట్రోఫీ.. నేరుగా మోదీ స్టేడియంలో ల్యాండ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.