ICC T20 Ranking : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మరింత దృఢపర్చుకున్నాడు. అతడు మంగళవారం సౌతాఫ్రికాపై హాఫ్ సెంచరీ బాదడం వల్ల, ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో ఏకంగా 10 రేటింగ్ పాయింట్లు దక్కించుకున్నాడు. దీంతో సూర్య 865 రేటింగ్స్‌తో టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడి తర్వాత పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 787 రేటింగ్స్‌లో రెండో ప్లేస్‌లో ఉన్నాడు. అంటే వీరిద్దరి మధ్య 78 రేటింగ్ తేడా ఉంది. దీంతో గతేడాది టీ20 వరల్డ్‌కప్ అనంతరం టాప్ ప్లేక్కు చేరిన సూర్య, 2024 పొట్టి ప్రపంచకప్ వరకూ అదే అగ్ర స్థానంలోనే ఉండే ఛాన్స్ ఉంది. యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (681 రేటింగ్స్) 7వ స్థానంలో ఉన్నాడు. ఇక యువ బ్యాటర్ తిలక్ వర్మ 10 స్థానాలు మెరుగుపర్చుకొని 55వ ప్లేస్ దక్కించుకున్నాడు. మరోవైపు సిక్సర్ హిట్టర్ రింకూ సింగ్ ఏకంగా 46 స్థానాలు ఎగబాకి 59వ పొజిషన్‌కు చేరుకున్నాడు.
టాప్ 5 బ్యాటర్లు
- సూర్యకుమార్ యాదవ్- భారత్- 865 పాయింట్లు
- మహ్మద్ రిజ్వాన్- పాకిస్థాన్- 787 పాయింట్లు
- ఎయిడెన్ మర్క్రమ్- సౌతాఫ్రికా- 758 పాయింట్లు
- బాబర్ అజామ్- పాకిస్థాన్- 734 పాయింట్లు
- రెలి రొస్సో- సౌతాఫ్రికా- 695 పాయింట్లు
-
Suryakumar Yadav Extends Lead As No.1 Ranked T20 Batter In ICC Men’s T20I Batter Rankings
— SportsTiger (@The_SportsTiger) December 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📸:- Getty Images#SAvsInd #IndvsSA #CricketTwitter #suryakumaryadav #sky #icc #newsupdate pic.twitter.com/1fksiOM4kQ
">Suryakumar Yadav Extends Lead As No.1 Ranked T20 Batter In ICC Men’s T20I Batter Rankings
— SportsTiger (@The_SportsTiger) December 13, 2023
📸:- Getty Images#SAvsInd #IndvsSA #CricketTwitter #suryakumaryadav #sky #icc #newsupdate pic.twitter.com/1fksiOM4kQSuryakumar Yadav Extends Lead As No.1 Ranked T20 Batter In ICC Men’s T20I Batter Rankings
— SportsTiger (@The_SportsTiger) December 13, 2023
📸:- Getty Images#SAvsInd #IndvsSA #CricketTwitter #suryakumaryadav #sky #icc #newsupdate pic.twitter.com/1fksiOM4kQ
-
ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే, టీమ్ఇండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 692 రేటింగ్స్‌లో టాప్ ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. అతడితోపాటు అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (692) కూడా సేమ్ రేటింగ్స్‌తో రెండో ప్లేస్‌లో ఉన్నాడు. వీరిద్దరి మధ్య ర్యాంక్ పొజిషన్ త్వరలోనే మారే ఛాన్స్ ఉంది. ఇక టాప్ 10లో బిష్ణోయ్ మినహా, భారత్ నుంచి మరో ప్లేయర్ లేకపోవడం గమనార్హం. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 632 రేటింగ్స్‌తో 13వ స్థానంలో కొనసాగుతున్నాడు.
టాప్ 5 బౌలర్లు
- రవి బిష్ణోయ్- భారత్- 692 పాయింట్లు
- రషీద్ ఖాన్- ఆఫ్గానిస్థాన్- 692 పాయింట్లు
- వానిందు హసరంగా- శ్రీలంక- 679 పాయింట్లు
- ఆదిల్ రషీద్- ఇంగ్లాండ్- 679 పాయింట్లు
- మహీశ్ తీక్షణ- శ్రీలంక- 677 పాయింట్లు
టాప్ పొజిషన్‌కు గిల్ - కెరీర్లో అత్యుత్తమం, ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్
ICC ర్యాంకింగ్స్‌లో దిగజారిన కోహ్లీ స్థానం.. విరాట్‌ను వెనక్కి నెట్టిన ఆ ప్లేయర్ ఎవరంటే?