ETV Bharat / sports

'న్యూజిలాండ్​తో మ్యాచ్​లో హార్దిక్​ బౌలింగ్ చేయాలని ఆశిస్తున్నా' - జహీర్ ఖాన్

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా.. టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య బౌలింగ్ చేస్తే జట్టుకు మరింత బలం చేకూరుతుందని మాజీ పేసర్ జహీర్ ఖాన్(Zaheer Khan News) అన్నాడు. నెట్స్​లో హార్దిక్​ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు.

hardik pandya
హార్దిక్ పాండ్య
author img

By

Published : Oct 28, 2021, 10:34 PM IST

టీమ్​ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(Hardik Pandya Bowling) నెట్స్‌లో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. నెట్స్‌లో హార్దిక్ పాండ్య బౌలింగ్‌ చేయడం పట్ల భారత మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌(zaheer khan news) సంతోషం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో పాండ్య రెండు ఓవర్లు బౌలింగ్‌ చేస్తాడని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. హార్దిక్ బౌలింగ్‌ చేస్తే భారత బౌలింగ్ దళం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నాడు.

hardik
బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న హార్దిక్

"హార్దిక్ పాండ్య నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు బౌలింగ్‌ చేస్తాడని ఆశిస్తున్నా. అతడు బౌలింగ్‌ చేయడం చాలా కీలకం. పాండ్య బౌలింగ్‌ చేస్తే ఆ విభాగం సమతూకం అవుతుంది. విరాట్ కోహ్లీకి ఆరో బౌలర్‌ని వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏ జట్టుని చూసినా కనీసం ఆరుగురు బౌలర్లు ఉన్నారు. ఒక్క భారత జట్టులో తప్ప. టీమిండియా ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగుతోంది. దీంతో బౌలర్లను రొటేట్‌ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వారు స్వేచ్ఛగా బౌలింగ్‌ చేయలేకపోతున్నారు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మనం ఇలాంటి పరిస్థితినే చూశాం"

--జహీర్‌ఖాన్, మాజీ ఆటగాడు.

అక్టోబర్‌ 31న టీమిండియా, న్యూజిలాండ్‌ జట్లు(IND vs NZ t20) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ ఇరుజట్లకు కీలకంకానుంది. ఎందుకంటే రెండు జట్లు పాకిస్థాన్​తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాయి. ఇదిలా ఉండగా, కొన్నాళ్ల క్రితం హార్దిక్‌కు వెన్ను భాగంలో శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి పాండ్య బౌలింగ్‌కి దూరంగా ఉంటున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్‌ చేయలేదు. దీంతో టీమిండియాకు ఆరో బౌలర్‌ సమస్య ఏర్పడింది. హార్దిక్‌ బౌలింగ్‌ చేయని పక్షంలో అతడిని జట్టు నుంచి తప్పించాలనే వాదనలు కూడా మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో హార్దిక్ మళ్లీ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం గమనార్హం.

ఇదీ చదవండి:

T20 World Cup 2021: నెట్స్​లో బౌలింగ్ ప్రాక్టీస్ చేసిన హార్దిక్ పాండ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.