ETV Bharat / sports

అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు: హార్దిక్‌ పాండ్య

author img

By

Published : Jan 28, 2023, 11:52 AM IST

న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ ఓటమితో ప్రారంభించింది. వన్డేలో కీవీస్​ను క్లీన్​స్వీప్​ చేసిన టీమిండియా..టీ20లో వెనకడుగు వేసింది. ఈ నేపత్యంలో మాట్లాడిన హార్దిక్​ కొన్ని కీలక కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు..

hardik pandya blunt assessment after defeat in 1st t20i
మొదటి టీ20లో ఓడిపోవడంపై హార్దిక్ కమెంట్స్

న్యూజిలాండ్​ను ఊపిరాడకుండా చేసి వన్డే సిరీస్​లో విజయం తమ సొంతం చేసుకుంది టీమిండియా. ప్రత్యర్థి జట్టును క్లీన్​స్వీప్ చేసింది. అయితే అదే ఉత్సాహంతో హార్దిక్‌ పాండ్య నాయకత్వంలో టీ20లోకి అడుగుపెట్టిన భారత్.. ఓటమిని చవిచూడక తప్పలేదు. రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో కివీస్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

"రాంచీ పిచ్‌ ఇలా స్పందిస్తుందని అనుకోలేదు. ఇరు జట్ల ఆటగాళ్లం ఆశ్చర్యానికి గురయ్యాం. అయితే ఇవాళ కివీస్‌ క్రికెటర్లు మా కంటే ఉత్తమ క్రికెట్ ఆడారు. అందుకే ఫలితం వారికి అనుకూలంగా వచ్చింది. పాత బంతి కంటే కొత్త బంతి కాస్త ఎక్కువగా తిరుగుతుంది. అలాగే బౌన్స్‌ అవుతుంది. కానీ, రాంచీలో మాత్రం విభిన్నంగా మారిన పరిస్థితి మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఛేదనలో త్వరగా వికెట్లను కోల్పోయినప్పటికీ.. నేను, సూర్య కుమార్ క్రీజ్‌లో ఉన్నప్పుడు రేసులోనే ఉన్నామనిపించింది. చివరికి కివీస్‌ విజయం సాధించింది. ఈ వికెట్‌ మీద 177 పరుగులు ఇవ్వడం సరైంది కాదు. మేం బౌలింగ్‌లో కాస్త వెనుకబడ్డామనిపించింది. అదనంగా 25 పరుగులు సమర్పించాం. దాంతోనే ఓటమిపాలు కావాల్సి వచ్చింది"

వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ, సూర్య కుమార్‌ కీలక ఇన్నింగ్స్ ఆడటం మినహా భారత బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో విఫలం కావడం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. కెప్టెన్ హార్దిక్‌ కూడా ఇదే విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాంచీ మైదానం బౌలింగ్‌కు కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ.. తొలుత న్యూజిలాండ్​కు ఎక్కువగా పరుగులు ఇవ్వడంతోనే లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియాకి కష్టంగా మారిందని తెలిపాడు.

"వాషింగ్టన్ సుందర్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. అన్ని విభాగాల్లో రాణించాడు. ఇలా ఆడుతుంటే మిగతావారిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు జట్టులో చాలామంది యువకులు ఉన్నారు. ఇలాంటి ఓటముల నుంచి పాఠాలను నేర్చుకొని ముందుకు సాగుతాం" అని హార్దిక్‌ పాండ్య వెల్లడించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ లఖ్​నవూ వేదికగా ఆదివారం జరగనుంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.