ETV Bharat / sports

'భారత్ ఈసారి వరల్డ్​కప్ గెలవడం కష్టమే'.. యువీ సంచలన వ్యాఖ్యలు - వన్డే వరల్డ్​ కప్​

Yuvraj Singh World Cup : ఈ ఏడాది భారత్​ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్​ సమరం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని క్రికెట్​ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వన్డే ప్రపంచకప్​పై కీలక వ్యాఖ్యలు చేశాడు టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​. ఇంతకీ యువీ ఏమన్నాడంటే?

Yuvaraj Singh Comments On Indian Cricket Team World Cup Win

author img

By

Published : Jul 11, 2023, 9:44 PM IST

Yuvraj Singh World Cup : ఈసారి భారత్​ వేదికగా జరగబోయే ప్రపంచకప్​న​కు దాదాపు మూడు నెలల సమయం ఉంది. ఇందుకోసం ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు ఆయా జట్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఎవరి బలాబలాలు ఎలాగున్నా.. తమ దేశం తరఫున ప్రాతినిథ్యం వహించే జట్టే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తారు ఎవరైనా. కానీ, ఇందుకు భిన్నంగా కామెంట్స్​ చేశాడు టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమ్​ఇండియా టైటిల్​ను గెలుస్తుందనే నమ్మకం నాకైతే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే టైటిల్​ గెలవాలంటే ఏం చేయాలో అని కూడా పలు సూచనలు చేశాడు.

నిజాలు ఒప్పుకోక తప్పదు..
'నిజాయితీగా చెప్పాలంటే ఈసారి టీమ్​ఇండియా.. వన్డే వరల్డ్​కప్​ను గెలుస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. ఓ దేశ భక్తుడిగా భారత్ గెలుస్తుందని చెప్పవచ్చు. కానీ జట్టు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా భారత జట్టు మిడిల్ ఆర్డర్‌ చాలా బలహీనంగా ఉంది. శ్రేయస్ అయ్యర్, రిషభ్​ పంత్, జస్ప్రీత్​ బుమ్రా, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ గాయాల కారణంగానే మిడిల్ ఆర్డర్‌లో సరైన ప్లేయర్లు కనిపించడం లేదు.'అని ఓ ప్రముఖ యూట్యూబ్​ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్వూలో తెలిపాడు యువీ.

రోహిత్​ రాణిస్తేనే..
'కెప్టెన్‌ రోహిత్ శర్మ గొప్ప ఆటగాడని అన్నాడు యువరాజ్​. కానీ అతడు కొన్నాళ్లుగా ఫామ్​లో లేడని అంతా అంటున్నారుని.. అది జట్టుకు అంత పెద్ద సమస్యేమి కాదని తెలిపాడు యూవీ. 'ఎందుకంటే 2019 వన్డే ప్రపంచకప్​నకు ముందు కూడా రోహిత్ పేలవమైన ఆటతీరును ప్రదర్శించాడు. అంతేకాకుండా ఐపీఎల్ 2019 సీజన్‌లో కూడా హిట్​ మ్యాన్​ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. అయినా 2019 వరల్డ్​కప్​లో 5 సెంచరీలు బాది మంచి ఫామ్​లోకి వచ్చాడు. కనీసం 20 మంది ప్లేయర్లనైనా ప్రపంచకప్​ సమరానికి సిద్ధం చేయాలి. టాప్​ ఆర్డర్‌లో రోహిత్​, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ ఉండటం వల్ల జట్టు పటిష్ఠంగా ఉంది. కోలకతా నైట్​రైడర్స్​ స్టార్​ ప్లేయర్​ రింకూ సింగ్​ ప్రస్తుతం చాలా బాగా రాణిస్తున్నాడు. అతడిని లోయర్​ ఆర్డర్​ బ్యాటింగ్​కు దింపితే బాగా రాణిస్తాడు' అని యువరాజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.