టీమ్ఇండియాతో జరిగిన మూడో టెస్టులో (Ind vs Eng 3rd test) ఇంగ్లాండ్ ఘన విజయం సాధించడంలో పేసర్ ఓలి రాబిన్సన్ కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలవడమనేది నా కల అని రాబిన్సన్ పేర్కొన్నాడు.
"నేను ఆడుతున్న మొదటి సిరీస్‌లోనే ఈ అవార్డు గెలుచుకోవడం సంతోషంగా ఉంది. ఇక్కడ బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదించాను. పరిస్థితులు అనుకూలించడం వల్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (5/65) చేయగలిగాను. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌తో కలిసి బౌలింగ్ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. అది నా ఆటతీరును మరింత మెరుగుపరిచింది. నిత్యం నేర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా."
-ఓలీ రాబిన్సన్, ఇంగ్లాండ్ బౌలర్
కోహ్లీని ఔట్ చేయాలంటే..
రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఔట్ చేయడం సంతోషంగా అనిపించిందని రాబిన్సన్ తెలిపాడు. 'అతడిని ఔట్ చేయాలంటే 4, 5 స్టంప్స్ స్ధానాల్లో ఫీల్డర్లను ఉంచి అవుట్‌సైడ్ బంతులేస్తే చాలు.. కోహ్లీ వారికి దొరికిపోతాడు. నేను ఇదే వ్యూహాన్ని అనుసరించి అతడిని అవుట్ చేశా' అని రాబిన్సన్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి : IndvsEng: ఆ అభిమానిపై జీవితకాల నిషేధం