ETV Bharat / sports

IND vs ENG: చెమటోడ్చిన భారత్​.. ఇంగ్లాండ్​దే పైచేయి - ఇండియా vs ఇంగ్లాండ్ హైలైట్స్

లార్డ్స్​ టెస్టు మూడో రోజు ముగిసే సరికి ఇంగ్లాండ్​ జట్టు 391పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య జట్టుకు 27 పరుగుల ఆధిక్యం లభించింది. కెప్టెన్ రూట్​ భారీ సెంచరీతో ఆకట్టుకోగా.. బెయిర్​ స్టో, రోరీ బర్న్స్​ ఫర్వాలేదనిపించారు.

India vs England
ఇండియా vs ఇంగ్లాండ్
author img

By

Published : Aug 14, 2021, 11:37 PM IST

లార్డ్స్ టెస్టు మూడో రోజు దాదాపు ఆధిపత్యం మొత్తం ఇంగ్లాండ్​దనే చెప్పాలి. ఆతిథ్య జట్టును ఆలౌట్​ చేశామన్న సంతృప్తి తప్పితే మిగిలిందేమి లేదు. రూట్​ భారీ సెంచరీతో(180; 321 బంతుల్లో) భారత తొలి ఇన్నింగ్స్​ ఆధిక్యాన్ని దాటివేసింది ఇంగ్లాండ్​.

119/3తో మూడో రోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్​ తొలి సెషన్​లో 97 పరుగులు జోడించింది. వికెట్​ కోల్పోకుండా భారత బౌలర్లకు చిరాకు తెప్పించారు రూట్​- బెయిర్​ స్టో ద్వయం. ఈ క్రమంలోనే వీరిద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ టీమ్​ఇండియా సహనాన్ని పరీక్షించారు. నాలుగో వికెట్​కు 121 పరుగులు నమోదు చేసి తమ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. 216/3తో లంచ్​ విరామానికి వెళ్లింది ఇంగ్లాండ్.

England - India Second Test Highlights
రూట్ సెంచరీ అభివాదం

అనంతరం కాసేపటికే బెయిర్​ స్టో వికెట్​ను కోల్పోయింది ఆతిథ్య జట్టు. సిరాజ్​ ఈ జోడీని విడగొట్టి మూడో రోజు తొలి వికెట్​ను అందించాడు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన జోస్​ బట్లర్​ కూడా రూట్​కు సహకరించాడు. ఐదో వికెట్​కు 54 పరుగులు జోడించింది రూట్- బట్లర్​ జంట. ఈ జోడీని ఇషాంత్ విడగొట్టాడు. తర్వాత వచ్చిన మొయిన్ అలీ కూడా ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్​కు సహకరిస్తూనే చెత్త బంతుల్ని బౌండరీకి తరలించాడు. ఆరో వికెట్​కు వీరిద్దరూ 58 రన్స్​ అందించారు.

England - India Second Test Highlights
భారత ఆటగాళ్లు

టీ విరామం అనంతరం వరుసగా రెండు వికెట్లు అందించాడు ఇషాంత్​. అలీ, సామ్ కరన్​ను వరుస బంతుల్లో ఔట్​ చేశాడు. తర్వాత కొద్దిసేపటికే రాబిన్సన్​ను సిరాజ్​ ఎల్బీగా వెనక్కి పంపాడు. లేని రన్​కు ప్రయత్నించి మార్క్​ వుడ్​ రనౌట్​గా వెనుదిరిగాడు.

రూట్​ సెంచరీ..

ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్ ఆసాంతం కెప్టెన్ రూట్​ ఇన్నింగ్సే హైలైట్. రెండో రోజు ముగిసేప్పటికీ 49 పరుగులతో ఉన్న రూట్​.. మూడో రోజు ఆట రెండో బంతికే ఫోర్​తో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. సహచర ఆటగాళ్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. బెయిర్​ స్టోతో కలిసి నాలుగో వికెట్​కు 121 పరుగులు, బట్లర్​తో కలిసి 54, మొయిన్​ అలీతో కలిసి 58 రన్స్​ సాధించాడు. ఈ క్రమంలో భారత తొలి ఇన్నింగ్స్​ ఆధిక్యాన్ని దాటేసింది ఇంగ్లాండ్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.