Rahul Dravid Scolded Dhoni: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఐపీఎల్‌లోనూ చెన్నై జట్టుకు సారథిగా ఉన్న మహీ.. ఉత్తమ కెప్టెన్‌గా పేరు నిలబెట్టుకున్నాడు. అయితే.. భారత జట్టు మాజీ సారథి గంగూలీ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆటగాడిగా ధోనీ మంచి నైపుణ్యం సంపాదించాడని చాలామంది అభిప్రాయపడతారు. ఇప్పుడు ఈ అంశంపై స్పందించిన డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Sehwag on Dhoni) మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు.
టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో ధోనీ ఆటగాడిగా ఎదిగాడని సెహ్వాగ్ అన్నాడు. 2006-07 సమయంలో ధోనీ ఓ అనవసరమైన షాట్ ఆడి పెవిలియన్ చేరినందుకు ద్రవిడ్ తిట్టాడని చెప్పుకొచ్చాడు. అప్పటినుంచి ధోనీ తన బ్యాటింగ్ శైలిని మార్చుకున్నాడని సెహ్వాగ్ అన్నాడు.
"ద్రవిడ్ సారథ్యంలో ధోనీకి ఫినిషర్ బాధ్యతలు అప్పగించింది టీమ్ఇండియా యాజమాన్యం. అయితే.. ఓ మ్యాచ్‌లో ధోనీ చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. అప్పుడు ధోనీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ద్రవిడ్. అప్పటినుంచి ధోనీలో మార్పు కనిపించింది. ఫినిషర్‌గా రాణించడం మొదలుపెట్టాడు."
--వీరేంద్ర సెహ్వాగ్, టీమ్ఇండియా మాజీ ఓపెనర్.
Ganguly Role in Dhoni Transformation: సారథిగా ఉన్నప్పుడు ధోనీ కోసం దాదా తన స్థానాన్ని త్యాగం చేసేవాడని వీరూ చెప్పాడు. చాలా తక్కువ మంది కెప్టెన్లు మాత్రమే ఇలా చేస్తారని ప్రశంసించాడు. గంగూలీ.. ఓపెనర్ స్థానాన్ని కూడా తన కోసం వదిలేసేవాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. గంగూలీ తీసుకున్న నిర్ణయాల వల్లే ధోనీ మంచి ఆటగాడిగా రాణించడంలో సఫలమయ్యాడని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి:
Rahul Dravid Coach: టీమ్ఇండియాకు అండగా 'ది వాల్'