న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే తొలి మ్యాచ్ కోసం రాంచీకి వచ్చిన భారత జట్టును గురువారం ఓ అతిథి కలుసుకున్నాడు. దీంతో శిబిరం ఉత్సాహంతో నిండిపోయింది. అతడే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. కొబ్బరి బొండం చేతిలో పట్టుకుని చాలా సాధారణంగా డ్రెస్సింగ్‌రూమ్‌లోకి వచ్చిన ధోనిని భారత ఆటగాళ్లు చుట్టుముట్టారు. మొదట టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యతో మాట్లాడిన మహి.. ఆపై వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్‌కు సూచనలు ఇస్తూ కనిపించాడు. శుభ్‌మన్ గిల్, చాహల్, వాషింగ్టన్ సుందర్‌తో కూడా ధోని మాట్లాడాడు. ఈ సందర్భంగా ట్విటర్‌లో బీసీసీఐ ఓ వీడియో పంచుకుంది. "రాంచిలో భారత శిబిరానికి ఎవరు వచ్చారో చూడండి.. 'ద గ్రేట్ మహి' అని శీర్షిక కూడా జోడించింది.
-
Look who came visiting at training today in Ranchi - the great @msdhoni! 😊#TeamIndia | #INDvNZ pic.twitter.com/antqqYisOh
— BCCI (@BCCI) January 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Look who came visiting at training today in Ranchi - the great @msdhoni! 😊#TeamIndia | #INDvNZ pic.twitter.com/antqqYisOh
— BCCI (@BCCI) January 26, 2023Look who came visiting at training today in Ranchi - the great @msdhoni! 😊#TeamIndia | #INDvNZ pic.twitter.com/antqqYisOh
— BCCI (@BCCI) January 26, 2023
కాగా, ధోనీ ఐపీఎల్ సీజన్లో ఆడతాడో లేదోననే ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ఇటీవలే రాంచీలో బ్యాట్ పట్టి ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నెట్స్‌లో సాధన చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అలాగే హార్దిక్‌తో కలిసి ధోని 'షోలే 2' పోజు ఇచ్చాడు. యే దోస్తీ.. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా.. మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి ద్విచక్రవాహనంపై దిగిన ఫొటోను తన ట్విటర్‌లో ఖాతాలో పంచుకున్నాడు. 'షోలే 2' త్వరలో రాబోతోందని పాండ్యా ఫన్నీగా పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటో సైతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా అయింది.