ETV Bharat / sports

బ్లాక్​ మెర్సీడీస్​లో ధోనీ రైడ్​ - ఆ నెంబర్​ ప్లేట్​కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే? - ధోనీ మెర్సిడీస్​ కారు

Dhoni Mercedes Car : టీమ్ఇండియా మాజీ సారథి ధోనీ.. తాజాగా రాంచీ వీధుల్లో తన కొత్త కారుతో సందడి చేశారు. అయితే ఫ్యాన్స్ దృష్టి మొత్తం ఆ కారు నెంబర్​పై పడింది. ఇంతకీ ఆ నెంబర్​ ప్రత్యేకత ఏంటంటే ?

Dhoni Mercedes Car
Dhoni Mercedes Car
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 6:40 PM IST

Updated : Nov 29, 2023, 7:51 PM IST

Dhoni Mercedes Car : టీమ్ఇండియా మాజీ సారథి ధోనీకి క్రికెట్ అంతే ఎంత ఇష్టమో కార్ల కలెక్షన్ అంతే కూడా అంతే ఇష్టం. ఆయన ఇంట్లోని ఓ పెద్ద గ్యారేజ్​లో వివిధ రకాల కార్లు, బైక్స్​ ఉంటాయో అందరికీ తెలిసిందే. అందులో వింటేజ్​ నుంచి మోడ్రన్​ వరకు అన్ని రకాల కలెక్షన్స్​ ఉంటాయి. ఇక ధోనీ కూడా అప్పుడప్పుడు వాటితో రాంచీలో రైడ్​ చేస్తూ కనిపించి ఆకట్టుకుంటాడు. తాజాగా కూడా ఓ మెర్సీడీజ్ కారును నడుపుతూ కనిపించాడు. బ్లాక్ కలర్​లో ఉన్న ఆ కారు చూపరులను ఆకట్టుకుని నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అయితే.. ఆ కారు కంటే దానిపైన ఉన్న నెంబర్​ ప్లేట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. 0007 అని దానిపై రాసుండగా.. ఫ్యాన్స్ దీన్ని జేమ్స్​ బాండ్​ కారు అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఎందుకంటే జేమ్స్​ బాండ్​ మూవీ టైటిల్​లో 007 ఉన్నందున ఫ్యాన్స్ ఈ కారును అలా పిలుస్తున్నారు.

ధోనీ సింప్లిసిటీ.. ఆ ఒక్క పనితో ఫ్యాన్స్​ ఫిదా..
Dhoni Autograph To Fan : ఇక తాజాగా మిస్టర్​ కూల్​ చేసిన ఓ పని నెటిజన్లను ఫిదా చేసింది. ఇటీవలే ఓ అభిమాని తన బైక్​పై ధోనీని ఆటోగ్రాఫ్‌ చేయమని కోరాడు. దీంతో ఆ ఫ్యాన్ కోరిక మేరకు బైక్ ముందు భాగంలో సైన్​ చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే.. బైక్ మీద దుమ్ము, మరకలను చూసిన ధోనీ.. తన టీ షర్టుతో స్వయంగా దాన్ని శుభ్రం చేశాడు. ఆ తర్వాత బైక్ మీద ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీన్ని చూసిన నెటిజన్లు ధోనీ సింప్లిసిటీకి ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

'ఐపీఎల్​లో మరో మూడేళ్ల పాటు'..
ఇక క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పిన ధోనీ.. ఐపీఎల్​లో మాత్రం కొనసాగుతున్నాడు. గతేడాది సీజన్​లోనూ రాణించిన కెప్టెన్​ కూల్.. 2023లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. రికార్డు స్థాయిలో ఏకంగా ఐదోసారి ట్రోఫీ అందించాడు. అయితే ప్రస్తుతం ధోనీ వయసు 41 ఏళ్లు. వయసు దృష్ట్యా అతడు వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ఆడదంటూ..అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. రిటెన్షన్ గడువు ముగిసే నేపథ్యంలో చెన్నై ఫ్రాంచైజీ.. తమ రిటెన్షన్ లిస్టులో ధోనీ పేరును చేర్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆనందంతో గంతులేస్తున్నారు. ధోనీని మరోసారి క్రీజులో చూడొచ్చంటూ ఆనందపడుతున్నాడు.

ఈ నేపథ్యంలో పలువురు మాజీలు ఈ విషయంపై స్పందించారు. ఇక ఏబీ డివిలియ‌ర్స్‌ కూడా ధోని మరో రెండు మూడేళ్ల పాటు ఐపీఎల్లో కొనసాగే సత్తా ఉన్న ఆటగాడని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. రిటెన్షన్లో అతడి పేరు చూడగానే నాకు సంతోషంగా అనిపించింది. గత సీజన్ అతడికి చివరిది అవుతుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే అతడు 2024 సీజన్ కూడా ఆడేందుకు సిద్ధమయ్యాడు. ధోని అంటే స‌ర్‌ప్రైజ్‌ ప్యాకేజ్.. అతడు ఇంకో రెండు.. మూడు ఏళ్ల పాటు ఐపీఎల్‌లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా వచ్చే ఎడిష‌న్‌లో ధోనీ క‌నిపించ‌నుండ‌టం నాకు నిజంగా సంతోషాన్నిస్తోంది" అని పేర్కొన్నారు.

నితిన్​కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ క్రికెటర్ - ఫ్యాన్​ బాయ్ మూమెంట్​ అంటే ఇదేనేమో!

'ధోనీ 99.9% సక్సెస్​ఫుల్- ఆయన నిర్ణయాలను క్వశ్చన్ చేసే దమ్ము ఎవరికీ లేదు!'

Last Updated : Nov 29, 2023, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.