ETV Bharat / sports

కాన్వే అరుదైన రికార్డు.. టెస్టు చరిత్రలో తొలి క్రికెటర్​గా! - డేవిడ్ కాన్వే బంగ్లాదేశ్

Devon Conway Record: న్యూజిలాండ్ బ్యాటర్ డేవిడ్ కాన్వే అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో టెస్టులో అర్ధసెంచరీ బాదడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

Devon Conway Test record, Devon Conway half centiry record, డేవాన్ కాన్వే రికార్డు, డేవాన్ కాన్వే హాఫ్ సెంచరీ రికార్డు
Devon Conway
author img

By

Published : Jan 9, 2022, 12:19 PM IST

Devon Conway Record: న్యూజిలాండ్ బ్యాటర్ డేవిడ్ కాన్వే టెస్టు క్రికెట్​లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో అర్ధసెంచరీ చేయడం ద్వారా.. ఈ ఫార్మాట్​లో తొలి ఐదు టెస్టుల్లోని మొదటి ఇన్నింగ్స్​ అన్నింటిలోనూ హాఫ్ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్​గా ఘనత వహించాడు.

గతేడాది జూన్​లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు ద్వారా సుదీర్ఘ ఫార్మాట్​లో అరంగేట్రం చేశాడు కాన్వే. ఈ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో అద్భుత డబుల్ సెంచరీ (200)తో సత్తాచాటాడు. తర్వాత ఎడ్జ్​బాస్టన్​ టెస్టులోనూ 80 పరుగులతో రాణించాడు. అలాగే టీమ్ఇండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్​లో 84 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం బంగ్లాదేశ్​తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో అద్భుత సెంచరీ (122)తో మెరిశాడు. ఆదివారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో మొదటి రోజు ఆటముగిసే సమయానికి 99 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

ఆరంభం అదిరింది

ఈ మ్యాచ్​లో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కివీస్​కు ఓపెనర్లు విల్ యంగ్, టామ్ లాథమ్ శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్​కు వీరిద్దరూ 148 పరుగులు జోడించారు. 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద యంగ్ ఔటయ్యాడు. అనంతరం లాథమ్​కు మద్దతుగా నిలిచాడు కాన్వే. బంగ్లా బౌలర్లపై విరుచుపడుతూ వీరిద్దరూ స్కోర్​బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ వికెట్ నష్టానికి 349 పరుగులు చేసింది. లాథమ్ (186*), కాన్వే (99*) క్రీజులో ఉన్నారు.

ఇవీ చూడండి: IND vs SA Test: 'కీలకమైన మూడో టెస్టులో ఆ జట్టుదే విజయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.