టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయా భరద్వాజ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కాల్లో ఆమెను బెదిరించిన దుండగులు ఆమెను చంపేస్తామంటూ హెచ్చరించారు. దీంతో భయభ్రాంతులకు గురైన దీపక్ చహర్ తండ్రి ఆగ్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభింతచారు.
అసలేం జరిగింది:
దీపక్ చహర్ తండ్రి తెలిపిన వివరాల ప్రకారం రిఖ్ స్పోర్ట్స్ యజమాని ధ్రువ్ పరేక్, అతని తండ్రి కమలేశ్ పరేక్.. దీపక్ భార్య జయ భరద్వాజ్ దగ్గర రూ. 10లక్షలు అప్పుగా తీసుకున్నారు. వ్యాపారం కోసం అని చెప్పడంతో 2022 అక్టోబర్ 7న ఆమె ఆన్‌లైన్‌లో రూ.10 లక్షలు పంపించారు. కానీ ఆ డబ్బును వారు దుర్వినియోగం చేసినట్లు తెలుసుకున్న జయా భరద్వాజ్ డబ్బు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. దానికి ఆ తండ్రి, కొడుకులు నిరాకరించారు. అంతే కాకుండా ఆమెకు ఫోన్ చేసి అసభ్యకర వ్యాఖ్యలతో దుర్భాషలాడి ఆమెను చంపేస్తామంటూ బెదిరించారు.
అయితే ఈ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారి, ఆయన కుమారుడు ఉన్నట్లు ఆరోపణులు వస్తున్నాయి. మోసం చేసిన వారిద్దరికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో సంబంధం ఉన్నట్లు తెలియడంతో కంపెనీ యజమానుల వివరాలను సేకరిస్తున్నారు. కాగా దీపక్ చహర్ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది.
దీపక్, జయ భరద్వాజ్‌ల వివాహం గతేడాది జూన్ 1న జరిగింది. కాగా గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట 2022 జూన్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మరోవైపు టీమ్ ఇండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు చహర్. చహర్ టీమిండియా తరపున ఏడు వన్డేల్లో 10 వికెట్లు, 24 టి20 మ్యాచ్‌ల్లో 29 వికెట్లు పడగొట్టాడు.