టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం వెస్టిండీస్‌తో(WI vs SA t20 Match) జరిగిన మ్యాచ్ నుంచి అనూహ్యంగా తప్పుకొన్నాడు దక్షిణాఫ్రికా కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్(Quinton De Kock News). కీలక మ్యాచ్‌కు కొద్ది సమయం ముందే తాను వైదొలుగుతున్నట్లు తెలిపాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్ ఆడట్లేదని మేనేజ్మెంట్కు స్పష్టం చేశాడు. కాగా.. ప్రతి మ్యాచ్ ముందు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మోకాళ్లపై కూర్చొని బ్లాక్ లివ్స్ మ్యాటర్‌కు(Black Lives Matter) సంఘీభావం తెలపాలని క్రికెట్ సౌతాఫ్రికా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డికాక్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
మోకాలిపై కూర్చోవడం ఇష్టం లేకే డికాక్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకొన్నాడని టీమ్ఇండియా ఆటగాడు దినేశ్ కార్తీక్(Dinesh Karthik news) ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో డికాక్‌పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు అతడికి మద్దతు తెలుపుతున్నారు.
సీఎస్ఏ ఏమందంటే.?
బ్లాక్ లివ్స్ మ్యాటర్‌కు మద్దతుగా నిలవడం ఇష్టం లేక మ్యాచ్ నుంచి డికాక్ తప్పుకోవడాన్ని వ్యక్తిగత కారణంగా స్వీకరించింది క్రికెట్ సౌతాఫ్రికా. అయితే.. దీనికి సంబంధించి మేనేజ్మెంట్ నుంచి వివరణ కోరనున్నట్లు తెలిపింది.
మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. 143 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. మర్క్రమ్(51) పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఇదీ చదవండి:
IPL 2022 Auction: 'ప్రతి జట్టులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు అవసరం'