లాక్‌డౌన్‌తో టీమ్ఇండియా క్రికెటర్లందరూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. మాజీ సారథి ధోనీ మాత్రం వాటికి దూరంగా ఉన్నాడు. మహీకి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని అతడి భార్య సాక్షి సింగ్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తోంది. ఇటీవలే చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన లైవ్‌చాట్‌లో మాట్లాడిన సాక్షి.. సామాజిక మాధ్యమాల్లోకి ధోనీ రాకపోవడానికి గల కారణాన్ని వెల్లడించింది.
"ధోనీ గురించి మీ అందరికీ తెలుసు ఎప్పుడూ ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చి మాట్లాడడు. కరోనా గురించి ఏదైనా విషయం షేర్ చేయాలన్నా ఒత్తిడికి గురవుతాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ మహమ్మారి నివారణ గురించి ఏదో ఓ విషయాన్ని చెబుతారు. ప్రజలందరూ దానిని పాటిస్తారు. ప్రస్తుత సమయంలో ప్రధాని కంటే ఎవరూ ఎక్కువ కాదు. అందుకే మహీ సోషల్ మీడియాలోకి రావట్లేదు"
-సాక్షి సింగ్, ధోనీ భార్య
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు ధోనీ. ఈ ఏడాది ఐపీఎల్లో సత్తాచాటి తిరిగి జట్టులో చోటు దక్కించుకోవాలని అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా లీగ్ నిరవధిక వాయిదా పడింది. అయితే ఐపీఎల్ కోసం మహీ విభిన్నంగా సాధన చేశాడని, అందరూ కొత్త ధోనీని చూస్తారని సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా, ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఇది చదవండి: