ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​ ఆతిథ్యానికి అమెరికా రెడీ - ICC news

టీ-20 ప్రపంచకప్​-2023ను అమెరికాలో నిర్వహించడానికి ఆ దేశ క్రికెట్​ బోర్డు ఆసక్తి చూపుతోంది. భారత్​, పాకిస్థాన్​ల మధ్య జరిగే మ్యాచ్​లకూ తటస్థ వేదికగా ఉంటామని యూఎస్​ఏ క్రికెట్​ బోర్డు సీఈఓ ఇయాన్​ హెగ్గిన్స్​ తెలిపారు. రాబోయే పదేళ్లలో ఐసీసీలో శాశ్వత సభ్య దేశంగా ఉండాలన్నది వారి ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

USA Cricket expresses desire to host ICC T20 World Cup
'టీ20 ప్రపంచకప్​ను నిర్వహించడానికి అమెరికా రెడీ!'
author img

By

Published : Jun 10, 2020, 7:02 AM IST

2023లో జరగబోయే ఐసీసీ టీ-20 ప్రపంచకప్​కు ఆతిథ్యం ఇవ్వడానికి యూఎస్​ఏ క్రికెట్​ బోర్డు ఆసక్తి వ్యక్తం చేస్తోంది. దక్షిణాసియాకు చెందిన ప్రజలు అమెరికాలో ఎక్కువగా ఉండటం వల్ల వారు ఈ టోర్నీని నిర్వహించడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది.

గతంలో బేస్​ బాల్​, ఫుట్​బాల్​, బాస్కెట్​బాల్​తో పోల్చితే సాకర్​కు ఆ దేశంలో తక్కువ ప్రజాదరణ ఉన్నప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1994లో ఫిఫా ప్రపంచకప్​కు ఆతిథ్యం ఇచ్చాయి. ఈ టోర్నీని అప్పట్లో దాదాపుగా 35 లక్షల మంది వీక్షించారు.

USA Cricket expresses desire to host ICC T20 World Cup
స్టేడియంలో ప్రేక్షకులు

"మీరు యూఎస్​ఏలో ఆడితే ప్రతి స్టేడియం ప్రేక్షకులతో నిండిపోతుంది. భారత్​, పాకిస్థాన్​ లాంటి దేశాల మధ్య క్రికెట్​ టోర్నీని నిర్వహించడానికి అమెరికా కంటే పెద్ద వేదిక ఎక్కడ ఉంటుంది. అలాంటి మ్యాచ్​లకు తటస్థ వేదికగా ఎంచుకుంటే ఇరు జట్లను సంతృప్తి పరచగలమనే నమ్మకం మాకు ఉంది. రాబోయే పదేళ్లలో ఐసీసీలో శాశ్వత సభ్యులై ఉండాలన్నది మా ప్రధాన లక్ష్యం."

-ఇయాన్​ హిగ్గిన్స్​, అమెరికా క్రికెట్​ సీఈఓ

ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్​ ఇప్పటికే 6 వన్డేలు, పది టీ20లకు ఆతిథ్యం ఇచ్చింది. అదే స్టేడియంలో ఆగస్టులో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య 2 మ్యాచ్​ల టీ20 సిరీస్​ను నిర్వహించనున్నారు. దీంతో ఐసీసీ నిర్వహించే పెద్ద టోర్నీలతో సహా కొన్ని దేశాలకు తటస్థ వేదికగా ఉండటానికి ఆసక్తి చూపారు.

అంతర్జాతీయ మ్యాచ్​లను నిర్వహించడానికి కనీసం 6 వేదికలను సిద్ధం చేయాలని ప్రణాళిక చేస్తున్నట్లు హెగ్గిన్స్​ తెలిపారు. గతేడాది డిసెంబర్​లో స్కాట్లాండ్​ను ఓడించి అమెరికా అంతర్జాతీయ జట్టు హోదాను పొందింది.

యుఎస్​ఏ క్రికెట్​ జట్టు

ఇదీ చూడండి... 'కోహ్లీ, రోహిత్​ వన్డే స్వరూపాన్నే మార్చేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.