ETV Bharat / sports

'టీమ్​ఇండియాలో పూర్తిస్థాయి ఫీల్డర్స్​ లేరు!' - mohammad kaif news

ప్రస్తుత భారత జట్టులో పూర్తిస్థాయి ఫీల్డర్స్​ కరవయ్యారని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్​ మహ్మద్​ కైఫ్​. గతంతో పోలిస్తే మైదానంలో ఎలాంటి బంతులనైనా అడ్డుకోగలిగే వారి సంఖ్య తగ్గిందని అన్నాడు.

Team India lacks complete fielder: Mohammad Kaif
'టీమ్​ఇండియాలో పూర్తిస్థాయి ఫీల్డర్స్​ లేరు!'
author img

By

Published : May 11, 2020, 7:14 PM IST

టీమ్​ఇండియా ప్రస్తుతం ఫీల్డింగ్​లో తగిన ప్రదర్శన చేయడం లేదన్నాడు మాజీ క్రికెటర్​ మహ్మద్​ కైఫ్. యువరాజ్​ సింగ్​, తాను కలిసి గతంలో ఫీల్డింగ్​లో జట్టుకు వెన్నుదన్నుగా నిలిచామని తెలిపాడు. అయితే ఇది ప్రస్తుత జట్టులో మందగించిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మైదానంలో బంతి ఎటునుంచి వచ్చినా దాన్ని అందుకోగల సామర్థ్యం ఆటగాళ్లలో ఉండాలన్నాడు. ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా.. బ్యాటింగ్​, బౌలింగ్​తో పాటు స్లిప్​లో క్యాచ్​లను అవలీలగా పట్టుకుంటున్నాడని చెప్పాడు. క్రీడాకారుడిగా జడేజా రోజురోజుకీ మరింత మెరుగవుతున్నాడని మహ్మద్​ కైఫ్​ స్పష్టం చేశాడు.

"ఒక బ్యాట్స్‌మన్‌ కట్‌ షాట్‌, హుక్‌ షాట్‌, పుల్‌షాట్‌, బౌన్సర్‌కు ఆడటం, ఇన్‌స్వింగ్‌ డెలివరీని సమర్ధవంతంగా ఎదుర్కొంటే వారిని గ్రేట్‌ బ్యాట్స్‌మన్‌ అంటాం. అలానే ఫీల్డింగ్‌లో కూడా అన్ని రకాల నైపుణ్యం ఉంటేనే అతడు కంప్లీట్‌ ఫీల్డర్‌ అవుతాడు."

-కైఫ్, టీమ్​ఇండియా మాజీ ఆటగాడు

"యువరాజ్​ కాకుండా మీకు తెలిసిన ఉత్తమ ఫీల్డర్లు ఉన్నారా" అని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు దక్షిణాఫ్రికా క్రికెటర్​ ఏబీ డివిలియర్స్​ అని సమాధానమిచ్చాడు కైఫ్​. అతడు బుల్లెట్​లాగా క్యాచ్​లు పడతాడని ప్రశంసించాడు.

ఇదీ చూడండి.. 'ఆసీస్​కు అగ్రస్థానమా.. ఎలా సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.