ETV Bharat / sports

కశ్మీర్ మాదే.. అఫ్రిదీకి కౌంటర్ ఇచ్చిన ధావన్ - అఫ్రిదీపై గంభీర్ మండిపాటు

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మరోసారి కశ్మీర్ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై టీమ్​ఇండియా క్రికెటర్లు మండిపడుతున్నారు.

అఫ్రిదీ
అఫ్రిదీ
author img

By

Published : May 18, 2020, 10:19 AM IST

Updated : May 18, 2020, 10:49 AM IST

ప్రపంచం మొత్తం కంటికి కనపడని కరోనా వైరస్‌తో పోరాడుతుంటే పాకిస్థాన్‌ మాత్రం కశ్మీర్‌పై మాట్లాడుతోంది. తాజాగా పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదీ పీవోకేపై స్పందిస్తూ.. కశ్మీర్‌, భారత ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. దీనిపై టీమ్ఇండియా క్రికెటర్లు స్పందించారు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అఫ్రిదీ వ్యాఖ్యలకు దీటైన జవాబిచ్చాడు.

"కరోనా మహమ్మారితో ప్రపంచం పోరాడుతుంటే మీరు మాత్రం కశ్మీర్‌పైనే పడి ఏడుస్తున్నారు. కశ్మీర్‌ మాది. మాతోనే ఉంటుంది, ఎప్పటికీ మాదే. కావాలంటే 22 కోట్ల మందిని తీసుకురా. మాలో ఒక్కరు.. లక్షల మందితో సమానం."

-ధావన్, టీమ్​ఇండియా క్రికెటర్

ఈ ట్వీట్‌కు నెటిజెన్ల నుంచి విశేష స్పందన రాగా, అంతకుముందే గౌతమ్‌ గంభీర్‌, హర్భజన్‌ సింగ్‌ పాక్‌ మాజీ సారథిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంభీర్‌ తొలుత స్పందిస్తూ.. "అఫ్రిదీ 16 ఏళ్ల వృద్ధుడు, పాక్‌లోని 7 లక్షల సైన్యానికి 20 కోట్ల ప్రజల మద్దతుందని ఇటీవల అన్నాడు. అయినా, వాళ్లు 70 ఏళ్లుగా కశ్మీర్‌ కోసం యాచిస్తూనే ఉన్నారు. పాక్‌ ప్రజల్ని మోసం చేయడానికి అఫ్రిదీ, ఇమ్రాన్‌ఖాన్‌, బజ్వా లాంటి జోకర్లు భారత్‌పై, ప్రధాని మోదీపై విషం చిమ్ముతున్నారు. అయితే, మీరెప్పటికీ కశ్మీర్‌ను పొందలేరు. బంగ్లాదేశ్‌ గుర్తుందా?" అని దీటుగా వ్యాఖ్యానించాడు.

హర్భజన్‌ కూడా ఒక వీడియోలో మాట్లాడుతూ.. కరోనా విపత్తు వేళ అఫ్రిదీ మద్దతు కోరితే తాను, యువీ స్పందించామని, అయినా, భారత్‌పై అతడు విషం చిమ్ముతున్నాడని మండిపడ్డాడు. అతడిని స్నేహితుడిగా పిలిచినందుకు బాధపడుతున్నానని భజ్జీ తెలిపాడు. అఫ్రిదీకి ఆ అర్హత లేదని తేల్చిచెప్పాడు.

Last Updated : May 18, 2020, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.