టీమ్ఇండియాలో ఆడాలంటే ఇప్పుడు యోయో టెస్టులో అర్హత సాధించాలి. గత కొన్నేళ్ల నుంచి దీనిని తప్పనిసరి చేశారు. అయితే ఈ విధానాన్ని తప్పుబట్టిన సెహ్వాగ్.. ప్రతిభ కంటే దానికే ప్రాముఖ్యం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
"యోయో టెస్టుతో హార్దిక్ పాండ్యకు ఎలాంటి ఇబ్బంది లేదు. బౌలింగ్ వల్ల అతడికి వర్క్‌లోడ్ పెరిగిపోతోంది. యోయో టెస్టులో పాస్ కాకపోవడం వల్లే అశ్విన్, వరుణ్ చక్రవర్తి జట్టులోకి రాలేకపోతున్నారు. దీనిని నేను ఒప్పుకోవడం లేదు. మేం ఆడినప్పడు యోయో ఉండుంటే సచిన్, లక్ష్మణ్, గంగూలీ.. పాస్ కాలేకపోయేవారు. నిర్ణీత 12.5 మార్క్ కంటే వాళ్లకు తక్కువే వచ్చేవేమో" అని సెహ్వాగ్ చెప్పాడు.
ఇటీవల ఇంగ్లాండ్‌తో టీ20తో సిరీస్‌కు రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తిలను యోయో టెస్టులో అర్హత సాధించని కారణంగానే, జట్టులోకి ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఫిట్‌గా ఉన్న జట్టులో ప్రతిభ లేక మ్యాచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటని సెహ్వాగ్ ప్రశ్నించాడు. అందుకే ప్రతిభ ఉన్న ఆటగాళ్లను తీసుకుంటే, తర్వాత వారు ఫిట్‌నెన్ సాధిస్తారని అభిప్రాయపడ్డాడు.