ETV Bharat / sports

సెలక్టర్లు నన్ను వృద్ధుడని అనుకుంటున్నారు: భజ్జీ

టీమ్​ఇండియాలో చోటు దక్కుతుందని ఇంకా ఆశిస్తున్నట్లు తెలిపాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఐపీఎల్​లో మెరుగ్గా రాణిస్తున్నపుడు జాతీయ జట్టుకు ఎంపికవడంలో తప్పులేదని అన్నాడు.

భజ్జీ
భజ్జీ
author img

By

Published : May 26, 2020, 5:16 AM IST

టీమ్​ఇండియాకు ఆడటానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఐపీఎల్​లో ఇంకా ఆడగలుగుతున్నానని.. అందుకే జాతీయ జట్టుకు ఎంపికవుతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు.

"టీమ్​ఇండియాకు ఆడటానికి ఇప్పటికీ సిద్ధమే. ఐపీఎల్​లో ఇంకా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నా. చిన్నస్టేడియాలు, మెరుగైన ఆటగాళ్ల మధ్య బౌలింగ్ చేయడం చాలా కష్టమైన పని. ఐపీఎల్​లో ఇంకా గొప్పగా బౌలింగ్ చేస్తున్నపుడు జాతీయ జట్టుకు ఎందుకు పని చేయను. అయినా నన్ను సెలక్టర్లు పట్టించుకోవడం లేదు. వారు నన్ను వృద్ధుడిగా భావిస్తున్నారు."

-హర్భజన్ సింగ్, వెటరన్ స్పిన్నర్

హర్భజన్ సింగ్ టీమ్​ఇండియాకు 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో వరుసగా 417, 269, 25 వికెట్లను పడగొట్టాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.