ETV Bharat / sports

ఐపీఎల్​ పెద్దోడుపై వేటు.. మ్యాచ్​లు ఆడకుండా నిషేధం - cricket news

ఐపీఎల్ అంకుల్​గా పేరు తెచ్చుకున్న బౌలర్ ప్రవీణ్ తాంబేపై అనర్హత వేటు పండింది. బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఐపీఎల్​ పెద్దోడుపై వేటు.. మ్యాచ్​లు ఆడకుండా నిషేధం
బౌలర్ ప్రవీణ్ తాంబే
author img

By

Published : Feb 28, 2020, 5:21 AM IST

Updated : Mar 2, 2020, 7:59 PM IST

ఐపీఎల్​ కొత్త సీజన్​ కోసం సన్నద్ధమవుతున్న కోల్​కతా నైట్​రైడర్స్​కు నిరాశపరిచే వార్త ఇది. ఆ జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమైన 48 ఏళ్ల బౌలర్ ప్రవీణ్ తాంబేపై ఐపీఎల్ గవర్నింగ్​ కౌన్సిల్ వేటు వేసింది. బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రవీణ్.. రిటైర్మెంట్​ తీసుకుని విరమించుకున్నాడని, ఆ తర్వాత ముంబయి లీగ్​లో ఆడాడని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు. అనంతరం ఎవరికీ చెప్పకుండా దుబాయ్​లో టీ20 లీగ్​ ఆడాడని పేర్కొన్నారు. అందుకే ఈ వేటు వేసినట్లు స్పష్టం చేశారు.

గతేడాది డిసెంబరులో జరిగిన ఐపీఎల్​ వేలంలో ఈ పెద్దోడిని కోల్​కతా నైట్​రైడర్స్​ రూ.20 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. అంతకు ముందు 2013-16 మధ్య రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్, సన్​రైజర్స్ హైదరాబాద్​ తరఫున 33 మ్యాచ్​లు ఆడాడు. 28 వికెట్లు తీశాడు. అతడిని వేటు వేసిన కారణంగా మరి ఇప్పుడు కేకేఆర్ ఎవరిని తీసుకుంటుందో చూడాలి.

Last Updated : Mar 2, 2020, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.