ETV Bharat / sports

తొలి వన్డే పాకిస్థాన్​దే.. టేలర్ శతకం వృథా - బ్రెండన్​ టేలర్​ వార్తలు

బంగ్లాదేశ్​తో జరిగిన తొలి వన్డేలో 26 పరుగుల తేడాతో పాకిస్థాన్​ విజయం సాధించింది. పాక్​ బౌలర్ల షహీన్​, రియాజ్​ ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​కు దెబ్బతీసి తమ జట్టును విజయంవైపు నడిపించారు.​ జింబాబ్వే బ్యాట్స్​మన్​ టేలర్​ చేసిన శతకం ఆ జట్టుకు గెలుపును అందించలేకపోయింది.

Pakistan vs Zimbabwe: Afridi leads Pakistan's victory despite Taylor's hundred
తొలి వన్డే పాకిస్థాన్​దే.. టేలర్ శతకం వృథా
author img

By

Published : Oct 31, 2020, 7:31 AM IST

కరోనా విరామం తర్వాత సొంతగడ్డపై తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ వన్డే సిరీస్‌ను పాకిస్థాన్‌ విజయంతో మొదలెట్టింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 26 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 281 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ (58), హారిస్‌ సొహైల్‌ (71) అర్ధశతకాలతో రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ముజరబాని (2/39), చిసొరో (2/31) రాణించారు. ఛేదనలో జింబాబ్వే 49.4 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. టేలర్‌ (112; 116 బంతుల్లో 11×4, 3×6) శతకంతో సత్తాచాటడం, వెస్లీ (55) కూడా రాణించడం వల్ల ఓ దశలో పాక్‌కు షాకిచ్చేలా కనిపించిన జింబాబ్వేను షహీన్‌ (5/49), రియాజ్‌ (4/41) దెబ్బ తీశారు.

మళ్లీ నవ్వులపాలు

ఫీల్డింగ్​లో బద్దకం, వికెట్ల మధ్య సమన్వయ లోపం లాంటి అవలక్షణాలు పాకిస్థాన్​ క్రికెట్​ జట్టు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా జింబాబ్వేతో వన్డేలోనూ రనౌట్​ కాకుండా ఉండేందుకు ఆ జట్టు బ్యాట్స్​మెన్​ ఇద్దరూ ఒకే ఎండ్​కు పరుగెత్తడం నవ్వుల పాలైంది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడతున్నాయి. ఇన్నింగ్స్​ 26వ ఓవర్​ అయిదో బంతిని పాయింట్​ దిశగా ఆడిన ఇమామ్​ సింగిల్​ తీసేందుకు ప్రయత్నించగా.. నాన్​స్ట్రైకర్​ హారిస్​ వెంటనే స్పందించాడు. కానీ, బంతిని మాత్రమే చూస్తూ పరుగెత్తిన ఇమామ్​.. పాయింట్​లో ఫీల్డర్​ డైవ్​ చేసి బంతిని ఆపడం వల్ల తిరిగి క్రీజువైపు మళ్లాడు.

అలా ఇద్దరు బ్యాట్స్​మెన్​ ఒకేవైపుగా క్రీజు చేరేందుకు పరుగులు పెట్టారు. ఇమామ్​ క్రీజులో బ్యాట్​ పెట్టేందుకు డైవ్​ చేయడం గమనార్హం. ఆ బంతిని వికెట్​ కీపర్ అందుకోలేకపోయాడు. అతని వెనుక ఉన్న ఫీల్డర్​ దాన్ని అందుకున్నాడు. బౌలర్​కు విసరడం వల్ల అతను రనౌట్​ చేశాడు. మూడో అంపైర్​ ఇమామ్​ను ఔట్​గా ప్రకటించాడు. ఇలా పరుగెత్తడం పాక్​ ఆటగాళ్లకు మాత్రమే చెల్లుతుందని, కొన్ని విషయాలు ఎప్పటికీ మారవని, నవ్వుకోవడానికి ఓ కారణం దొరికిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.