ప్రస్తుత భారత పేస్ దళం టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైందని అభిప్రాయపడ్డాడు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ. ఇటీవలే మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తాతో సామాజిక మాధ్యమాల వేదికగా వీడియో చాట్‌లో పాల్గొన్న షమీ.. పలు విషయాలు పంచుకున్నాడు.
"ప్రపంచంలో ఎవ్వరూ టీమ్ఇండియా ఐదుగురు ఫాస్ట్ బౌలర్లను కలిగి ఉంటుందని ఊహించి ఉండరు. ఇప్పుడే కాదు, భారత క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యుత్తమమైన పేస్ దళం. ప్రస్తుత జట్టులో 145 కి.మీ వేగంతో బంతులు వేయగల సామర్థ్యం కలిగిన బౌలర్లు ఉన్నారు."
-మహమ్మద్ షమీ, భారత బౌలర్
జట్టులో ఎవ్వరికీ అసూయ లేదని, ఒకరి విజయాన్ని ఇంకొకరు ఆస్వాదిస్తారని షమీ తెలిపాడు. అంతా ఒక కుటుంబంలా ఉంటారని చెప్పుకొచ్చాడు.

షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ వంటి పేసర్లు గత రెండేళ్లుగా స్థిరంగా ప్రదర్శన కనబరుస్తున్నారు. జట్టు విజయంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు.

షమీ ఇప్పటివరకు భారత్ తరఫున 49 టెస్టులు, 77 వన్డేలు, 11 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 336 వికెట్లు కైవసం చేసుకున్నాడు. చివరగా ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పాలుపంచుకున్నాడు.

ఇదీ చూడండి:'భారత జట్టు బౌలింగ్ ప్రదర్శన అద్భుతం'