ETV Bharat / sports

ఐపీఎల్​ తుదిపోరు.. రికార్డులతో హిట్​ మ్యాన్ జోరు​ - దుబాయ్​ వేదికగా

ఐపీఎల్ ఫైనల్లో ముంబయి జట్టు విజయంలో సారథి రోహిత్​ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఫిట్​నెస్​పై సందేహాలకు తెరదించుతూ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో హిట్​ మ్యాన్.. తన ఐపీఎల్​ ప్రస్థానంలో చేరుకున్న పలు మైలురాళ్లేంటో ఇప్పుడు చూద్దాం.

mumbai indians captain rohith sharma created these records in ipl 2020 season
ఐపీఎల్​ తుదిపోరు.. రికార్డులతో హిట్​ మ్యాన్ జోరు​
author img

By

Published : Nov 11, 2020, 5:41 AM IST

దుబాయ్​ వేదికగా దిల్లీతో మంగళవారం జరిగిన ఐపీఎల్​ తుది పోరులో పలు రికార్డులను నమోదు చేశాడు ముంబయి ఇండియన్స్​ సారథి రోహిత్​ శర్మ. ఐపీఎల్​ చరిత్రలో 200 మ్యాచ్​లు ఆడిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ధోనీ(204) ముందున్నాడు. ఇక రోహిత్​ తన ఖాతాలో వేసుకున్న మరిన్ని రికార్డులివే..

ప్రతి యాభైల్లో..

  • దిల్లీతో జరిగిన ఫైనల్లో 36 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ పూర్తి చేశాడు రోహిత్​ శర్మ. అయితే.. తన ప్రతి 50వ ఐపీఎల్​ మ్యాచ్​లోనూ అతడు అర్ధ సెంచరీలను సాధించాడు.
  • 50, 100, 150​, 200వ మ్యాచ్​ల్లో రోహిత్​ శర్మ.. అజేయ అర్ధ శతకాలతో చెలరేగాడు.

తొలి కెప్టెన్​..

  • ఐపీఎల్​ పైనల్లో.. రోహిత్​ అర్ధ సెంచరీ చేయడం ఇది రెండోసారి. మరే కెప్టెన్​ ఈ ఘనత సాధించలేదు.
  • 2015లో చెన్నై సూపర్​ కింగ్స్​తో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో.. ముంబయి సారథి రోహిత్​ శర్మ.. హాఫ్​ సెంచరీ సాధించాడు. మళ్లీ ఈసారి దిల్లీతో జరిగిన మ్యాచ్​లోనూ అతడు ఈ రికార్డు నమోదు చేశాడు.

ఐదోది, ఆరోది..

  • కెప్టెన్​గా రోహిత్​కు ఇది ఐదో టైటిల్​. ఆటగాడిగా ఆరోది. 2009లో కప్పు గెలిచిన డెక్కన్​ ఛార్జర్స్​ జట్టులో అతడు సభ్యుడు.

టీ20ల్లో రోహిత్​సేన​ హోరు..

  • 2011, 2013 టీ20 ఛాంపియన్​ లీగ్​ ట్రోఫీలను ముంబయి ఇండియన్స్​ కైవసం చేసుకుంది.
  • 2013, 2015, 2017, 2019, 2020 ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ సీజన్లలో కప్​ను ముద్దాడింది.

అత్యధిక స్కోరు..

మంగళవారం జరిగిన మ్యాచ్​లో రోహిత్​ శర్మ 68 పరుగుల్ని సాధించాడు. ఫైనల్​ మ్యాచ్​లో ఓ భారత కెప్టెన్​ అత్యధిక పరుగులు ఇవే. విదేశీయుల్లో వార్నర్​(69) ముందున్నాడు.

మూడు దేశాల్లోనూ..

  • సారథిగా తమ జట్టును మూడు దేశాల్లో జరిగిన మ్యాచ్​ల్లో విజేతగా నిలిపాడు హిట్​మ్యాన్​.
  • దక్షిణాఫ్రికా, భారత్​, యూఏఈల్లో జరిగిన మ్యాచ్​ల్లో ముంబయి ఇండియన్స్​ విజయం సాధించింది.

ఇరు జట్ల కెప్టెన్లు..

  • 2016 ఐపీఎల్​ తుదిపోరులో సన్​రైజర్స్​ సారథి డేవిడ్​ వార్నర్​ 69 పరుగులు సాధించగా.. ఆర్​సీబీ సారథి కోహ్లీ 54 పరుగుల్ని సాధించాడు.
  • తాజాగా ఈ సీజన్​లో దిల్లీ తరఫున కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​.. 65 పరుగులు చేయగా.. ముంబయి తరఫున రోహిత్(62)​ అర్ధ శతకాన్ని బాదాడు.

ఇదీ చూడండి:ఐపీఎల్​లో రోహిత్ శర్మ@200​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.