ETV Bharat / sports

'ఛాంపియన్లు ఎప్పుడూ గొప్ప నిర్ణయాలే తీసుకుంటారు'

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీ రిటైర్మెంట్​పై వస్తోన్న వార్తల గురించి స్పందించాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ మాథ్యూ హెడెన్​. ఈ విషయమై ధోనీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడని తెలిపాడు.

MS Dhoni will make the best decision on retirement: Mathew Hayden
'ఛాంపియన్లు ఎప్పుడూ గొప్ప నిర్ణయాలే తీసుకుంటారు'
author img

By

Published : May 17, 2020, 6:01 AM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ రిటైర్మెంట్​​పై వస్తోన్న ఊహాగానాలపై స్పందించాడు ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్​. వీడ్కోలు​ విషయమై అతడు త్వరలో ఒక నిర్ణయానికి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. గతేడాది జరిగిన ప్రపంచకప్​ సెమీస్​లో న్యూజిలాండ్​పై ఓటమి తర్వాత నుంచి టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీ క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్​తో రీఎంట్రీ ఇవ్వాలకున్నా కరోనా కారణంగా ఆ లీగ్ వాయిదా పడింది.

"నా మిత్రుడైన​ ధోనీ కెరీర్​ గురించి మాట్లాడాలంటే నాకెంతో కష్టంగా ఉంటుంది. నా దృష్టిలో అతనొక ఛాంపియన్​. ఆటగాళ్లు ఆట నుంచి ఎప్పుడు వైదొలగాలో వ్యక్తిగతంగా వారికి తెలుసు. కానీ కెరీర్​ చివర్లో ఒత్తిడిని ఎవరూ కోరుకోరు. ధోనీ.. టీమ్​ఇండియా విజయాన్ని సాధించడం కోసం తీసుకున్న గొప్ప నిర్ణయాల వలె త్వరలోనే ఓ సంచలన నిర్ణయం తీసుకుంటాడని ఆశిస్తున్నా".

- మాథ్యూ హెడెన్​, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

ఐపీఎల్ నిర్వహణపై హెడెన్​ స్పందించాడు. "వాస్తవానికి విదేశీ ఆటగాళ్లు లేకుండానే టోర్నీ నిర్వహించవచ్చు. కానీ, విదేశీ క్రికెటర్ల వల్ల అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ప్రపంచదేశాల ఆటగాళ్లను ఒకచోట చేర్చడానికి ఐపీఎల్​ దోహదపడుతుంది. స్టేడియాలను శుభ్రం చేసుకుని మ్యాచ్​లు నిర్వహించవచ్చు." అని తెలిపాడు

ఇదీ చూడండి.. బంగ్లా క్రికెటర్​ బ్యాట్​ను వేలంలో కొన్న అఫ్రిదీ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.