ETV Bharat / sports

పీసీబీ వాట్సప్ గ్రూప్ నుంచి అమీర్, హసన్ లెఫ్ట్! - హసన్ అలీ తాజా వార్తలు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన ఆటగాళ్ల కాంట్రాక్టుల లిస్టులో పేసర్లు మహ్మద్ అమీర్, హసన్ అలీ, వాహబ్ రియాజ్​లకు చోటు దక్కలేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమీర్, హసన్ పీసీబీ వాట్సప్ గ్రూపు నుంచి లెఫ్ట్ అయినట్లు సమాచారం.

పీసీబీ
పీసీబీ
author img

By

Published : May 20, 2020, 1:28 PM IST

ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్​ బోర్డు 2020-21 సీజన్ కోసం ఆటగాళ్ల కాంట్రాక్టులను ప్రకటించింది. ఇందులో పేసర్లు మహ్మద్ అమీర్, హసన్ అలీ, వాహబ్ రియాజ్​లకు చోటు దక్కలేదు. ఈ లిస్టుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అమీర్, హసన్​ పీసీబీ వాట్సప్ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయినట్లు సమాచారం. అయితే రియాజ్ మాత్రం గ్రూపులో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

పీసీబీ మొత్తం 18 మందికి కాంట్రాక్టులను ప్రకటించింది. ఇది జులై 1నుంచి అమల్లోకి వస్తుంది. ఇందులో నసీమ్ షా, ఇఫ్తికర్ అహ్మద్​లు తొలిసారి చోటు దక్కించుకున్నారు. కాంట్రాక్టుల నుంచి తొలగించినా అమీర్​, హసన్, రియాజ్​లు సెలక్షన్​కు అందుబాటులోనే ఉంటారని స్పష్టం చేసింది బోర్డు.

హసన్ అలీ చివరిసారిగా 2019 ప్రపంచకప్​లో భారత్​తో జరిగిన మ్యాచ్​లో ఆడాడు. అమీర్, రియాజ్​ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్​లో పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.