ETV Bharat / sports

క్రికెట్ అభిమానులకు శుభవార్త.. సెప్టెంబరులో ఐపీఎల్​! - సెప్టెంబరు 25 నుంచి ఐపీఎల్​ 2020

సెప్టెంబరు 25 నుంచి నవంబరు 1 వరకు ఐపీఎల్​ను నిర్వహించే విషయమై బీసీసీఐ పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. దేశంలో అప్పటికి కరోనా కేసులు తగ్గుముఖం పడతాయన్న ఆశాభావంతో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని బీసీసీఐ సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

IPL 2020: BCCI targets September 25 to November 1 window
ఐపీఎల్​ అభిమానులకు శుభవార్త.. సెప్టెంబరులో ఐపీఎల్​!
author img

By

Published : May 20, 2020, 5:46 PM IST

దేశంలో కొవిడ్​-19 తగ్గుముఖం పట్టిన తర్వాత ఐపీఎల్​ నిర్వహించాలని భారత క్రికెట్​ నియంత్రణ మండలి యోచిస్తోంది. సెప్టెంబరు 25 నుంచి నవంబరు 1 మధ్య టోర్నీ జరిపే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేశంలో కరోనా కేసులు అప్పటికి తగ్గుముఖం పట్టవచ్చనే ఆశాభావంతో ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే దీనితో పాటు అనేక విషయాలపై త్వరలో చర్చించనుంది బీసీసీఐ.

ఈ విషయంపై ఓ ఐపీఎల్​ ఫ్రాంచైజీ అధికారి మాట్లాడుతూ .."అవును, మేము ఈ తేదీలపై దృష్టిసారించాం. కానీ, అదంతా దేశంలో కరోనా పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అయితే దేశంలో కేసుల సంఖ్య త్వరలోనే తగ్గుముఖం పట్టొచ్చని ఆశిస్తున్నాం" అని తెలిపాడు.

IPL 2020: BCCI targets September 25 to November 1 window
ఐపీఎల్​ అభిమానులకు శుభవార్త.. సెప్టెంబరులో ఐపీఎల్​!

ప్రణాళిక ప్రకారం టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియాలో అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ, ఇలాంటి పరిస్థితిలో టోర్నీని యథావిధిగా నిర్వహించడమనేది అసాధ్యమని ఆసీస్​ క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఒకవేళ ఈ టోర్నీ వాయిదా పడితే ఇదే సమయంలో ఐపీఎల్ నిర్వహించవచ్చని బీసీసీఐ ఆలోచిస్తోంది.

ఇదీ చూడండి.. తారక్​కు వార్నర్ 'పక్కా లోకల్' గిఫ్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.